Share News

Alleti Maheshwar: రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వాలి: ఏలేటి

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:21 AM

రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Alleti Maheshwar: రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వాలి: ఏలేటి

యాదాద్రి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ పూర్తైందని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60ు మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల పీఏసీఎస్‌ వద్ద ఆయన దీక్ష చేపట్టారు.


సీఎం రేవంత్‌ రేవంత్‌ రుణమాఫీ పూర్తైందని చెప్తుంటే.. ఆ శాఖ మంత్రి మాత్రం ఇంకా రూ.11వేల కోట్లు మాఫీ కావాల్సి ఉందని చెప్తున్నారని గుర్తు చేశారు. చందుపట్ల పీఏసీఎ్‌సలో రూ.42కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉండగా, కేవలం రూ.7కోట్లు మాత్రం విడుదలయ్యాయని తెలిపారు. ఆ నిధులు కూడా సాంకేతిక సమస్యతో రైతుల ఖాతాలో జమ కాలేదని తెలిపారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన తాము పోరాడతామన్నారు

Updated Date - Oct 05 , 2024 | 04:21 AM