Share News

CM Revanth : ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ బోర్డులు

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:16 AM

ప్రభుత్వ విద్యను కార్పొరేట్‌ స్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth : ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ బోర్డులు

  • విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు

  • క్వాడ్‌ జెన్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చ

  • పెట్టుబడులు పెట్టాలని

  • నోకియా కంపెనీకి ఆహ్వానం

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యను కార్పొరేట్‌ స్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. క్వాడ్‌ జెన్‌ కంపెనీతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ బోర్డులు(ఇంటెరాక్టివ్‌ వైట్‌ బోర్డులు) ఏర్పాటు చేయనున్నామని, విద్యార్థులకు రూ. 20 వేలలోపు విలువగల ల్యాప్‌టా్‌పలు ఉచితంగా అందించనున్నామని సీఎం తెలిపారు. క్వాడ్‌ జెన్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు. పథకం అమలుపై చర్చించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీలు ముందుకు రావాలని కోరారు. అలాగే మరో సమావేశంలో నోకియా కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశం అయ్యారు.

పారిశ్రామికాభివృద్ధిలో ముందంజలో ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి నోకియా ప్రతినిధులను కోరారు. నోకియా గ్లోబల్‌ హెడ్‌ మార్టిన్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సీఎం వివరించారు. ఈ భేటీలో నోకియా గ్లోబల్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ఎస్‌. నారాయణయ్య, సేల్స్‌ గ్లోబల్‌ హెడ్‌ మయాంక్‌ భాటియా, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌ ఇండియా ేసల్స్‌ మేనేజర్‌ రాకేష్‌, క్వాడ్జెన్‌ చైర్మన్‌ సీఎస్‌ రావు, యూఎ్‌సఎం చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ పద్మజ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 02:16 AM