Jeevan Reddy: కేసీఆర్‌ను కాపాడేందుకే బీజేపీ నేతల ధర్నాలు
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:20 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ.. సీబీఐ విచారణ కోరుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నిరసన చేపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
అందుకే సీబీఐ విచారణ కోరుతున్నరు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ.. సీబీఐ విచారణ కోరుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నిరసన చేపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొమ్ము కాసినందుకు ప్రతిఫలంగా కేసీఆర్‌ను కాపాడాలని ఆ పార్టీ చూస్తోందన్నారు. ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్‌ను కాపాడడం ఎవరి తరమూ కాదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతో్‌షను ఇరికించారని చెబుతున్న బీజేపీ.. దాన్ని ఎందుకు నిరూపించలేకపోయిందన్నారు.
బీఆర్‌ఎ్‌సను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చేశారనిఎద్దేవా చేశారు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లను కాపాడేందుకే బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్‌రెడ్డి.. అప్పట్లోనే కేంద్రానికి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అసలు మోదీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తుందన్న ఆరోపణలూ ఉన్నాయన్నారు. ముందు ఆ ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించుకోవాలని హితవు పలికారు.