Share News

Telangana: లారీ బీభత్సం.. టైర్లకింద నలిగిన ప్రాణాలు..

ABN , Publish Date - Dec 02 , 2024 | 06:37 PM

హైదరాబాద్ బీజాపూర్ హైవే ఆలూరు గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన కూరగాయాల వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. దీంతో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Telangana: లారీ బీభత్సం.. టైర్లకింద నలిగిన ప్రాణాలు..
Accident

Telangana: హైదరాబాద్ బీజాపూర్ హైవే ఆలూరు గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన కూరగాయాల వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. లారీ టైర్లకింద పలువురు నలిగిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాళ్ళు చేతులు విరగడంతో క్షతగాత్రులు ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నారు. మృతులు రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్). మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలురు స్టేజ్‌ వద్ద జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 02 , 2024 | 06:41 PM