Share News

Mancherial: రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ ఇస్తేనే బతుకుతాడు..

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:03 AM

శారీరక ఎదుగుదల లేకపోవడంతో ఏడాది వయసున్న బాబును ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలయ్యాయి! బాబు, కోటి మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని స్వస్థత పొందాలంటే రూ.16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ చేయించాలని వైద్యులు చెప్పారు.

Mancherial: రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ ఇస్తేనే బతుకుతాడు..

  • 8 ఏడాది బాబుకు అరుదైన వ్యాధి.. మరో 11 నెలల్లో ఇంజెక్షన్‌ ఇవ్వాల్సిందే: వైద్యులు

  • 8 దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

కోటపల్లి, జూలై4: శారీరక ఎదుగుదల లేకపోవడంతో ఏడాది వయసున్న బాబును ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలయ్యాయి! బాబు, కోటి మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని స్వస్థత పొందాలంటే రూ.16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ చేయించాలని వైద్యులు చెప్పారు. ఎకరం పొలం సాగు చేసుకొని బతికే తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? అని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన పడాల సతీశ్‌-రవళి దంపతులకు వచ్చిన పెద్ద కష్టమిది. వీరికి కుమారుడు శ్రేయాన్‌ (13నెలలు) ఉన్నాడు.


బాబు బోర్లా పడటం లేదని, బలహీనంగా ఉన్నాడంటూ ఆర్నెల్ల క్రితం మంచిర్యాల ఆస్పత్రిలో చూపించారు. గత ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబు ‘‘స్పైనల్‌ మస్య్కూలర్‌ అట్రాసి టైప్‌ 2’’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారించారు. చిన్నారికి రెండేళ్ల వయసు నిండేలోపు జోల్‌జన్‌స్మా ఇంజక్షన్‌ చేయించాలని, అప్పుడే ఫలితం ఉంటుందని, ఇంజెక్షన్‌ను అమెరికా నుంచి తెప్పించాలని, దాని ఖరీదు రూ.16 కోట్లు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి తమ కుమారుడిని బతికించాలని శ్రేయాన్‌ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 05:03 AM