Share News

Hyderabad: సుమన్‌కు అక్కినేని నాగేశ్వరరావు అభినయ పురస్కారం..

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:41 AM

విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు సుమన్‌(Actor Suman) అని వక్తలు అభివర్ణించారు. సాంస్కృతికబంధు సారిపల్లి కొండల్‌రావు(Saripalli Kondal Rao) సారథ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరరావు శతజయంతి వేడుకలు శుక్రవారం ముగిశాయి.

Hyderabad: సుమన్‌కు అక్కినేని నాగేశ్వరరావు అభినయ పురస్కారం..

హైదరాబాద్: విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు సుమన్‌(Actor Suman) అని వక్తలు అభివర్ణించారు. సాంస్కృతికబంధు సారిపల్లి కొండల్‌రావు(Saripalli Kondal Rao) సారథ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరరావు శతజయంతి వేడుకలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా డా.అక్కినేని నాగేశ్వరరావు(Dr. Akkineni Nageswara Rao) నాటక కళాపరిషత్‌ 30వ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: డబ్బుకు ఏసీపీ దాసోహం.. రూ. కోట్ల ఆస్తుల వ్యవహారంలో సెటిల్‌మెంట్‌


city3.2.jpg

ఇందులో భాగంగా నటుడు సుమన్‌కు అక్కినేని నాగేశ్వరరావు అభినయ పురస్కారం ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేవీ.రమణాచారి మాట్లాడుతూ తెలుగు సినీచరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు, సుమన్‌ పాత్రలు చెప్పుకోదగినవని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణకుమారి, మహ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు. మూడురోజులపాటు జరిగిన అక్కినేని నాటిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.


..............................................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................................

Collector: ముఖ గుర్తింపు హాజరు పెంచాలి..

- కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్)ను మరింత పెంచాలని కలెక్టర్‌ అనుదీప్‌(Collector Anudeep) ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం హుమాయున్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల కృషితో ఎఫ్‌ఆర్‌ఎస్ లో హైదరాబాద్‌ జిల్లా 67.65 శాతం హాజరుతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.

city2.jpg

పాఠశాలకు సక్రమంగా హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వచ్చేలా చూడాలన్నారు. ఆధార్‌ కార్డు లేని విద్యార్థులకు వెంటనే ఆధార్‌ నమోదు చేయాలని తహసీల్దార్‌కు సూచించారు. కలెక్టర్‌ వెంట డీఈవో రోహిణి, ఈఈ చలపతిరావు, డిప్యూటీ ఈవో రమణారాజు, డిప్యూటీ ఐవోఎస్‌ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 10:43 AM