Share News

Hyderabad: చలో.. అరుణాచలం.. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:18 AM

వేసవికాలం నేపథ్యంలో తెలంగాణ టూరిజం(Telangana Tourism) శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 21, మే 20, జూన్‌ 19న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) యాత్రకు స్పెషల్‌ టూర్‌ను సిద్ధం చేసింది.

Hyderabad: చలో.. అరుణాచలం.. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ

- పౌర్ణమి రోజున ప్రత్యేక యాత్రల నిర్వహణ

హైదరాబాద్‌ సిటీ: వేసవికాలం నేపథ్యంలో తెలంగాణ టూరిజం(Telangana Tourism) శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 21, మే 20, జూన్‌ 19న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) యాత్రకు స్పెషల్‌ టూర్‌ను సిద్ధం చేసింది. మార్గమధ్యలో వివిధ ఆలయాలను కూడా చూపించి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ముందుకుసాగుతోంది. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ యాత్రలో కాణిపాకం(Kanipakam), తిరువానమలై, వేలూరు అమ్మవారి దర్శనం ఉంటుంది.

ఇదికూడా చదవండి: Telangana: విధుల్లో నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు..!

ఏసీ బస్సుల్లో ప్రయాణం ఉండే ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.7,500, పిల్లలకు రూ.6,000 టికెట్‌ ధర ఉందని అధికారులు తెలిపారు. అలాగే, మండేఎండల్లో నచ్చిన ప్రదేశాలకు కుటుంబ సమేతంగా, బంధువులు, స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా తిలకించేందుకు ఆసక్తి కలిగిన వారి కోసం ఏసీ లగ్జరీ కారవాన్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 98485-40371లో సంప్రదించాలని వారు సూచించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రణరంగంగా హెచ్‌సీయూ.. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Apr 19 , 2024 | 11:18 AM