Share News

Hyderabad: మార్కెట్‌కు పోటెత్తిన మృగశిర చేపలు..

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:36 AM

మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌(Mushirabad Fish Market)కు మృగశిరకార్తెకు ఒకరోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి.

Hyderabad: మార్కెట్‌కు పోటెత్తిన మృగశిర చేపలు..

- కార్తె ప్రారంభానికి ఒక్కరోజు ముందుగానే పెద్ద ఎత్తున కొనుగోళ్లు

- చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌(Mushirabad Fish Market)కు మృగశిరకార్తెకు ఒకరోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. సాధారణ రోజుల్లో మార్కెట్‌లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగుతాయి. మృగశిర కార్తె సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు దిగుమతి అవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి అధికం కావడంతో వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, చేవెళ్ల జిల్లాలతోపాటు ఏపీలోని కైకలూరు, తెనాలి, ఆకువీడు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకున్నట్లు ముషీరాబాద్‌ వ్యాపారి పూసగోరక్‌నాథ్‌ తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: నిమ్స్‌లో మంత్రి పొన్నంకు వైద్య పరీక్షలు


గురువారం బొచ్చ, రవ్వ కిలో రూ.100 నుంచి 120కి విక్రయించారు. చిన్నసైజు చేపలు కిలో 100 రూపాయల చొప్పున విక్రయించారు. మృగశిర సందర్భంగా వీటి ధరలు శుక్రవారం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. కొర్రమీను చేపలు కిలో రూ. 400 నుంచి 450కి విక్రయించగా మృగశిర రోజున వీటి ధరలు అధికమవుతాయని అన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే ముషీరాబాద్‌ మార్కెట్‌లో విక్రయాలు మొదలవుతాయని తెలిపారు.

భారీగా చేపల దిగుమతి

మృగశిర కార్తె సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 టన్నుల చేపలు దిగుమతి అయ్యాయి. మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతాయి.

- గాండ్ల శివప్రసాద్‌, చేపల వ్యాపారి


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 09:36 AM