Share News

Hyderabad: సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హేగ్డే

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:54 AM

హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌హెగ్డే(Rahul Hegde) నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా ఉన్న రాహుల్‌ హెగ్డే సూర్యాపేట ఎస్పీగా వెళ్లారు.

Hyderabad: సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హేగ్డే

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌హెగ్డే(Rahul Hegde) నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా ఉన్న రాహుల్‌ హెగ్డే సూర్యాపేట ఎస్పీగా వెళ్లారు. ఇప్పుడు జరిగిన బదిలీల్లో యథాస్థానానికి వచ్చారు. అలాగే, ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఉన్న సాదన రష్మి పెరుమాళ్‌ను నార్త్‌జోన్‌ డీసీపీగా బదిలీ చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రేపు హైదరాబాద్‏కు కేంద్రమంత్రుల రాక...


అలాగే బాలానగర్‌ డీసీపీ శ్రీనివాసరావును బదిలీ చేసి ఆయన స్థానంలో సురేష్‏కుమార్‌ను, శంషాబాద్‌ డీసీపీ(Shamshabad DCP)గా ఉన్న నారాయణరెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా ఉన్న రాజేష్‏ను, మేడ్చల్‌ డీసీపీగా ఉన్న నికితాపంత్‌ను బదిలీ చేసి ఆమె స్థానంలో కోటిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 08:54 AM