TS News: తెలంగాణలో మరో స్కామ్.. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను వదలని వైనం..
ABN , Publish Date - Mar 05 , 2024 | 03:04 PM
Telangana: తెలంగాణలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. బల్దియాలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ స్కాం బయటపడింది. నాన్ అవెలబులిటి సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను ఫలక్‌నుమా సర్కిల్ అధికారులు జారీ చేసిన వైనం వెలుగు చూసింది. నాన్ అవెలబులిటి సమాచారం రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, మార్చి 5: తెలంగాణలో (Telangana) మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. బల్దియాలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ స్కాం (birth and death certificates scam) బయటపడింది. నాన్ అవెలబులిటి సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను ఫలక్‌నుమా సర్కిల్ అధికారులు జారీ చేసిన వైనం వెలుగు చూసింది. నాన్ అవెలబులిటి సమాచారం రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిల్స్‌లోనూ దందా జోరుగా సాగింది. 1998లో జన్మించిన వ్యక్తికి నవంబర్‌లో నాన్ అవెలబూలిటి కింద సర్టిఫికెట్ జారీ అయ్యింది. ఈ సర్టిఫికెట్లను ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, లాండ్ రిజిస్ట్రేషన్‌లకు ఘరానా మోసగాళ్లు వాడుతున్నట్లు బయటపడింది. గత కమిషనర్ లోకేష్ కుమార్ హయాంలో దాదాపు 36 వేల ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ రద్దు అయ్యాయి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటుగాళ్లు రెచ్చిపోయారు.
PM Modi: తెలంగాణలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన.. రేవంత్ వీడ్కోలు
ఉన్నతాధికారుల అండదండలతోనే దందా నడుస్తున్నట్లు సమాచారం. సమస్యను బట్టి డబ్బులు వసూలు చేయడం జరుగుతోంది. ఒక్కో సర్కిల్ నుండి రూ.3 లక్షలు, ఆదాయం ఎక్కువ ఉన్న సర్కిల్‌లో ఐదు లక్షలు నెలసరి ఆదాయం వసూలు అవుతున్న పరిస్థితి. సర్కిల్‌లో ఏఎంఓహెచ్ లేని చోట డిప్యూటీ ఈఈలను అధికారులు నియమించారు. అయితే ఇలాంటి ప్లేస్‌లో ఏఎంసీ/ రిజిస్ట్రార్‌లు బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్స్ జారీ అయ్యాయి. సీఎంఓహెచ్‌పై ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగులు సీఎమ్‌ఓహెచ్ తమను వేధిస్తున్నారని మేయర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. మొన్ననే నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో 84 లక్షల రూపాయలను కాజేసిన కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బయటపడ్డ బర్త అండ్ డెత్ సర్టిఫికెట్ల స్కాంపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి...
TS News: మాజీ సీఎం కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ
AP News: గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...