Share News

CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయొద్దు

ABN , Publish Date - Jan 09 , 2024 | 08:13 PM

గత బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ( BRS MLAS ) చేసిన తప్పులు మనం చేయకూడదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అన్నారు. మంగళవారం నాడు జిల్లాల వారిగా వరుసగా రెండో రోజు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయొద్దు

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ( BRS MLAS ) చేసిన తప్పులు మనం చేయకూడదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అన్నారు. మంగళవారం నాడు జిల్లాల వారిగా వరుసగా రెండో రోజు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నేడు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ ,రంగారెడ్డి జిల్లా నేతలతో సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సోమవారం (నిన్న) 5 ఉమ్మడి జిల్లాలపై సమీక్షలు నిర్వహించారు. జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాన్ని సీఎం రేవంత్ తీసుకున్నారు. ఈనెల 11,12,13 తేదీలల్లో వరుసగా 3 రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షించనున్నారు.

డబ్బు కోసం కాదు.. మంచి పేరు కోసం పనిచేయాలి

ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు కోసం కాదు.. మంచి పేరు కోసం పనిచేయాలని కాంగ్రెస్ నేతలు, అధికారులకు సూచించారు. ట్రాన్స్‌ఫర్లు ఇతర పనుల కోసం డబ్బులు తీసుకోవద్దని ఆదేశించారు. ఎమ్మెల్యేలు స్థానికంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు 10 కోట్ల స్పెషల్ ఫండ్ ఇస్తామని స్పష్టం చేశారు. హంగులు, ఆర్బాటాలకు పోవద్దని.. అందరి చూపు తమవైపే ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని.. సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. మరో రెండు, మూడు టర్మ్‌లు కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. పలు జిల్లాల్లో పర్యటిస్తానని.. ఈ పర్యటనల్లో జిల్లా సమస్యల పరిష్కారంపై చర్చిద్దామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ లోపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 09 , 2024 | 09:34 PM

News Hub