TS Govt: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కసరత్తు
ABN , Publish Date - Jul 30 , 2024 | 09:43 AM
Telangana: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జీలను సర్కార్ పరిశీలిస్తోంది. జస్టిస్ వెంకటేశ్వర రావు ప్రభుత్వ పరీశీలనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కసరత్తు మొదలుపెట్టింది.
హైదరాబాద్, జూలై 30: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ ( New Chairman of Electricity Commission) కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేపట్టింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జీలను సర్కార్ పరిశీలిస్తోంది. జస్టిస్ వెంకటేశ్వర రావు ప్రభుత్వ పరీశీలనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ (BRS) హయాంలో విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కసరత్తు మొదలుపెట్టింది. విద్యుత్ ఒప్పందాలపై, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తోంది.
విద్యుత్‌పై వాడీవేడీ చర్చ... బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ సీఎం
కాగా.. నిన్న అసెంబ్లీలో విద్యుత్ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు దిగమింగిందెవరో లెక్కతేలాలన్నారు. దొరికిపోతామని అర్థమైనందునే.. మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ కోరారని ఆరోపించారు. కానీ, విచారణ అనంతరం సుప్రీంకోర్టు కమిషన్‌ను కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసిందని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్నట్లుంది. జ్యుడీషియల్ విచారణ మేము అనలేదు. ఇదే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్ని అంశాల్ని ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేం నిరూపించుకుంటాం.. విచారణకు ఆదేశాలివ్వాలని కోరారు.
దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం, యాదాద్రి 260 ఇన్‌టూ 4, సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం, యాదాద్రి 4వేల విద్యుత్ ఒప్పందం బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వడంపై వారు అడిగితేనే ఆమోదించాం. కమిషన్ సమన్లు ఇచ్చినప్పుడు తమ వాదనలు వినిపిస్తే వాళ్ల నిజాయితీ బయటకు వచ్చేది. అక్కడికి వెళ్లకుండా ఆ కమిషనే వద్దు అని కోర్టుకు వెళ్లారు. హైకోర్టు వారి వాదనను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళితే విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. కమిషన్ చైర్మన్ పట్ల అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మార్చేందుకు ప్రభుత్వాన్ని సూచించింది. ఈ రోజు సాయంత్రంలోగా కొత్త చైర్మన్‌ను నియమిస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. జార్ఖండ్‌లో 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే... కొరియన్ కంపెనీ, బీహెచ్‌ఈఎల్, ఇంకో కంపెనీ టెండర్‌లో పాల్గొన్నాయని, తెలంగాణలో అంచనాలకు ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్ట్ ఇచ్చిన రోజే జార్ఖండ్ ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెండర్ పిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదే బీహెచ్‌ఈఎల్ 18శాతం తక్కువకు టెండర్ కోట్ చేసి అక్కడ పని దక్కించుకుందని పేర్కొన్నారు. 18శాతం తక్కువకు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండగా 4 వేల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్‌కు అప్పజెప్పారని అన్నారు. రెండున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామన్నారని, కానీ.. టెండరు ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇప్పటి వరకు ఉత్పత్తి మొదలు కాలేదని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
TPCC Chief: కొలిక్కొచ్చిన టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ.. ప్రకటన ఎప్పుడుంటే..!?
సీఎం రేవంత్‌పై జగదీశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు..
అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. అప్పటి పరిస్థితుల వల్లే బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. 2017 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల్ని సబ్ క్రిటికల్‌లో పూర్తి చేయాలని కేంద్రం చెప్పిందని, ఆ నాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో బీహెచ్‌ఈఎల్‌ను పిలిచి నాటి సీఎం వారితో మాట్లాడారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ‘‘సూపర్ క్రిటికల్ అయితే ఐదారేల్లు పట్టొచ్చు.. మేం తక్కువలో తక్కువ అంటే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్ వాళ్లు చెప్పారు. 270 ఇన్‌టూ ఫోర్ మెషినరీ సిద్ధంగా ఉందని సివిల్ వర్క్స్ చేసుకుంటే ఇక్కడ బిగించుకుని రెండేళ్లలో పని పూర్తిచేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎన్జీటీ కేసు, కరోనా ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది.
సబ్‌క్రిటికల్, సూపర్ క్రిటికల్ పేరుతో చేస్తున్న ప్రచారం సరైంది కాదు. యాదాద్రి, భద్రాద్రి బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామంటున్నారు. కొత్తగూడెంను కూడా బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చాం. దానిపై మాట్లాడటం లేదు. బీహెచ్‌ఈఎల్ నుంచి పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు ఎవరో నాకు తెలియదు. బీహెచ్‌ఈఎల్‌కు కాకుండా అదానీకి ఇవ్వాలన్నది మీ ఆలోచన. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. కరెంట్ పోయిందని హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే... కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నారు. వారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కరెంట్ సమస్యలపై మాట్లాడారు. ఆయనపైనా కేసులు పెడతారా? కోర్టులో జడ్జి, పీపీపై నమ్మకం లేకపోతే సాధారణ వ్యక్తి కూడా వారిని మార్చుకునే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వీళ్లు సుప్రీంకోర్టును తప్పుబడుతున్నారా?’’ అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కోర్టును, కోర్టు నిర్ణయాల్ని తప్పుదోవ పట్టించేలా సభలో మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. చైర్మన్‌ను మార్చి విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘సీఎం ఎందుకు అంతలా ఆవేశపడ్డారో? ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నారో? చర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్లీమళ్లీ గుర్తు చేసుకుంటున్నట్లున్నాడు. నాకు కూడా చంచల్‌గూడ జైలు గుర్తుంది. తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన. ఆయనకు చర్లపల్లే గుర్తుకు ఉంటది’’ అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు
Read Latest Telangana News And Telugu News