Delhi Liquor Case: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై నేడు విచారణ
ABN , Publish Date - Feb 28 , 2024 | 07:19 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Case) ఈడీ నోటీసులను (ED Notice) సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈరోజు విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్‌లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ నోటిసులకు కవిత గైర్హాజరవుతున్నారు.