TG News: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్
ABN , Publish Date - Oct 28 , 2024 | 01:54 PM
Telangana: ప్రతీ వారంలాగే ఈ వారం కూడా నందినగర్‌లో మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ ఫుడ్‌ను పలువురు ఇష్టంగా కొనుక్కుని తిన్నారు. వారికి తేలీది కాదా దాన్ని తిన్న తరువాత వారు అనారోగ్యం బారిన పడతారని. తిన్న తరువాత ఇంటికి వెళ్లిన తర్వాత హఠాత్తుగా వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 28: నగరంలో (Hyderabad) ఫుడ్ పాయిజన్ కలకలం రేపంది. స్ట్రీట్ ఫుడ్ తిని ఓ మహిళ మృతి చెందడం సంచలనంగా మారింది. అలాగే స్ట్రీట్ తిని అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే స్ట్రీట్ ఫుడ్ కారణంగా మహిళ మృతి చెందడంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది.. ఎవరు చనిపోయారు... వారు ఏం తిన్నారో తెలుసుకుందాం.
Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు
బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్ట్రీట్ ఫుడ్ తిని 29 ఏళ్ల మహిళ మృతి చెందడంతో పాటు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రతీ వారంలాగే ఈ వారం కూడా నందినగర్‌లో మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మోముస్‌ను పలువురు ఇష్టంగా కొనుక్కుని తిన్నారు. వారికి తేలీది కాదా దాన్ని తిన్న తరువాత వారు అనారోగ్యం బారిన పడతారని. మోమూస్‌ను ఇష్టంగా సేవించి ఇంటికి వెళ్లిన తర్వాత హఠాత్తుగా వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
అయితే మోమూస్ తినడంతో రేష్మ అనే 29 ఏళ్ల మహిళ కూడా అస్వస్థతకు గురవడంతో కుటుంబీకులు ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. రేష్మకు ముగ్గురు సంతానం. స్ట్రీట్ ఫుడ్ తిని రేష్మ మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ ముగ్గురు చిన్నారులు తల్లిలేని వారుగా మిగిలిపోవడం పలువురిని కలిచివేసింది. మరోవైపు ఈ ఘటనపై అనేక మంది పోలీసులను ఆశ్రయించారు.
మోముస్ తిని అనారోగ్యానికి గురైన పలువురు బాధితులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మోముస్‌ను ఎలా తయారు చేశారు.. ఇందులో ఏమైనా కలిసిందా.. లేక మోముస్ తయారీలో ఏమైనా నాసిరక పదార్థాలు ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Hyderabad: రూ.8 కోట్లు ఇవ్వలేదని భర్తను హత్య చేసి.. పోలీసులకు దొరక్కుండా..
ఈ వార్త కూడా చదవండి...
ప్రజావాణిలో అనూహ్య ఘటన
జీహెచ్‌ఎంసీ ప్రజావాణిలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో అధికారుల తీరుకు నిరసనగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులపై చర్యలు తీసుకుంటేనే తాను బయటికి వెళ్తా అంటూ సదరు వ్యక్తి నిరసనకు దిగాడు. ఏసీపీ, డీసీని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. రాంనగర్‌లో 430 గజాల స్థలంలో జీహెచ్ఎంసీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లికి సంబంధించిన ఆస్తిలో వాటా ఇవ్వకుండా సోదరులు నిర్మాణం చేయడంపై జీహెచ్ఎంసీ అధికారులకు సదరు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు రూ.12 లక్షలు లంచం తీసుకొని తనకు అన్యాయం చేస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు
Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి
Read Latest Telangana News And Telugu News