KTR: ఫార్ములా ఈరేస్ కేసుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:11 PM
Telangana: హెచ్ఎండీఏ ఒక కార్పోరేషన్ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉందని కేటీఆర్ అన్నారు. హెచ్ఎండీ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని.. దానికి ఆ మేరకు స్వతంత్రం ఉందన్నారు. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదని.. అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకు పోతే వాళ్ల ఇష్టమన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 20: ఫార్ములా ఈరేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (BRS Working President KTR) ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై కేటీఆర్ స్పందించారు. శుక్రవారం అసెంబ్లీ వద్ద మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఫార్ములా కేసులో అవినీతి లేదని తేలిందన్నారు. హెచ్ఎండీఏ ఒక కార్పోరేషన్ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉందన్నారు. హెచ్ఎండీ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని.. దానికి ఆ మేరకు స్వతంత్రం ఉందన్నారు. ముఖ్యమంత్రా లేదా ఇతరులెవరైనా మంత్రులు కొంత మంది సైకోలు తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియాలన్నారు. లంచ్ మోషన్పైన కోర్టు తేలుస్తుందన్నారు. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదని.. అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకు పోతే వాళ్ల ఇష్టమన్నారు. న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.
అసెంబ్లీలో ఏం జరిగింది.. చెప్పు చూపించింది ఎవరు..
ఓఆర్ఆర్ రోడ్డు.. సిట్ ఏర్పాటుపై
ఓఆర్ఆర్ రోడ్డు అమలు, సిట్ ఏర్పాటుపై కేటీఆర్ మాట్లాడుతూ.. టీఓటీ దేశంలో ఇప్పటికే అమలులో ఉందని.. టీఓటీ విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించామని చెప్పారు. ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చిందన్నారు. అమెరికా.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించిందని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీవోటీ విధానంలోనే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించామని చెప్పారు. ప్రైవేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్ ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలపైన హెచ్ఎండీఏ పరువు నష్టం కేసు వేసిందని గుర్తుచేశారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన హెచ్ఎండీ వేసిన కేసు అలాగే ఉందన్నారు.
ఆ లీజ్‌ను రద్దు చేసుకోండి...
ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డుపైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారని.. మరి కుంభకోణం అంటున్న ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌ను ఏందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారని, ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని అడిగారు. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలని అన్నారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు రీజనింగ్ వెంటనే రద్దు చేసి.. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారన్నారు. జడ్జ్ ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తామని తెలిపారు.
‘‘మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి. పదివేల కోట్ల రూపాయల కోకాపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలి. ప్రభుత్వం సభ్యులకు శిక్షణ ఇచ్చి స్పీకర్, ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఏంటి.. ఇలానేనా శిక్షణ ఇచ్చారు. స్పీకర్‌ను కూడా దళితుడు, దళితుడు అంటూ పదే పదే చెప్పడం ఆయన గౌరవాన్ని తగ్గించేలా చేయడమే’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Lagacharla Case: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కేటీఆర్ ఎపిసోడ్: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Read Latest Telangana News And Telugu News