Share News

Khairatabad Ganesh: మహాగణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:22 PM

Telangana: ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు.

 Khairatabad Ganesh: మహాగణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య
Khairatabad mahaganapathi

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఖైరతాబాద్ మహా గణనాధునికి (Khairatabad Maha Ganesh) ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు. ఉదయం గణపతి హోమం, ప్రత్యేక హారతి అనంతరం భక్తులను దర్శనానికి ఉత్సవ సమితి అనుమతిస్తోంది. ఖైరతాబాద్ బడా గణేష్ చూసేందుకు నగర నలుమూలలుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.ఈరోజు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ సమితి నిర్వహించనుంది. ఈ సందర్భంగా భారీ బందోభస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది.

Prakasam Barrage: బోట్ల తొలగింపునకు కొనసాగుతున్న అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ..


కాగా.. ఈఏడాది శ్రీ సప్తముక మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనమిస్తున్నారు. గత ఏడాది 63 అడుగుల ఎత్తున్న వినాయకుడిని ప్రతిష్టించగా.. ఈ ఏడాది 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ కొలువుదీరాడు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకున్న మీదట ఈ నెల 17 వ తేదీన ఘనంగా నిమజ్జన వేడుక జరుగనుంది. వినాయక చవితి రోజున మహాగణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తొలిపూజ నిర్వహించారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు.


ఇవాళ ఉదయమే ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేష్ ప్రతిను రూపొందించే పనులు ఆలస్యంగా ప్రారంభమయినా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందింది.


ఇవి కూడా చదవండి...

KTR: ఇంకెంతమంది రైతుల ప్రాణాలు బలిపెట్టాలి?

TG News: ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 12 , 2024 | 12:37 PM