Share News

Hydra: హై స్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం..

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:22 AM

అక్రమ నిర్మాణమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఉంటే హైడ్రా కూల్చివేయదు. అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచీతూచి అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం.

Hydra: హై స్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం..

హైదరాబాద్: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) (Htdra) రూటు మార్చింది. హై స్పీడ్ కూల్చివేతలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దూకుడు తగ్గించనుంది. ఈ వీకెండ్ హైడ్రా కూల్చివేతల వాయిదా వెనుక గ్రౌండ్ వర్క్ (Ground work) ఉంది. వారాంతం కూల్చివేతల (Weekend demolitions) విమర్శలతో.. ఇక సాధారణ రోజుల్లోనే కూల్చివేతలు చేసే యోచనలో హైడ్రా ఉన్నట్లు సమాచారం. అలాగే లీగల్ టీం సలహాలు తీసుకున్న తర్వాతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలియవచ్చింది. అక్రమ నిర్మాణమైన జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండిఏ (HMDA) అనుమతులు ఉంటే కూల్చివేయరు. అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచీతూచి అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం.


కాగా హైడ్రా కూల్చివేతలతో (Demolitions) ఇళ్లను కోల్పోయిన వారి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీ (MLC)లు పరిమర్శిస్తారు. మరికాసేపట్లో బండ్లగూడ, హైదర్ షా కోట్ మూసి పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), సబిత ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) ఆధ్వర్యంలో పరామర్శించనున్నారు. పార్టీ తరఫున, న్యాయపరంగా బాధితుల తరఫున తాము పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇస్తున్నారు. హైడ్రాపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నేతలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా వైరల్ ఫీవర్ కారణంగా ఎమ్మెల్యేల పర్యటనకు కేటీఆర్ దూరంగా ఉన్నారు.

నిరంకుశ ఇందిరమ్మ ప్రభుత్వ విధానాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నయిని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందన్నారు. ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు కనిపిస్తున్నాయని, ఇప్పటికే చాలామంది ఇళ్లు కోల్పోయారని, అటు మూసి పరివాహక ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో బాధితులు ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసిఆర్‌యే తమకు న్యాయం చేస్తారని బాధితులు నమ్ముతున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.


తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేకుండా పోయాయని, రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలనలా .. పిచ్చోడి చేతిలో రాయి లా తయారైందని హరీష్ రావు విమర్శించారు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు‌‌ .. ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. హైడ్ర పేరుతో పేదల మెడమీద కత్తి పెట్టి ఖాళీ చేయిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌పై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా తయారు అయ్యారని విమర్శించారు. రూ. 1500 కోట్లతో డీపీఆర్ చేయిస్తాం అని చెబుతున్నారు.. రూ. 150 కోట్లు పెట్టి పేదలకు మందులు కొనలేరా అని ప్రశ్నించారు.

Updated Date - Sep 29 , 2024 | 11:22 AM