KIRAN KUMAR REDDY: అమిత్ షా వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఎంపీ సీరియస్ వార్నింగ్
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:06 PM
బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం పట్ల కూడా భక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ పట్ల అమర్యాదగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది.
ఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల అమర్యాదగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాజ్యసభలో అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే వారికి రాజ్యాంగం పట్ల నమ్మకం, గౌరవం లేదని అర్థమవుతుందని తెలిపారు.
మొన్నటి రోజు రాజ్యసభలో అమిత్ షా మాట్లాడిన మాటలను తాను మాట్లాడలేదు ఎవరో ఎడిట్ చేశారని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమిత్ షా చేసిన తప్పును కప్పి పుచ్చుకొని దేశ ప్రజలను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ పట్ల ఆమర్యాదగా మాట్లాడి బీజేపీ నాయకుల మనసులో ఏముందో వెలిబుచ్చారని అన్నారు. బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం పట్ల కూడా భక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
అమిత్ షా ఏమన్నారంటే..
ప్రతి దానికీ అంబేడ్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఫ్యాషన్‌గా మారిందని.. ఆయన పేరు కాకుండా దేవుడిని స్మరించుకుంటే ఏడు జన్మలు స్వర్గం లభిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా సమర్థించారు. అంబేడ్కర్ చరిత్రను తుడిచిపెట్టేందుకు ఆ పార్టీ పన్నని కుట్ర లేదని విమర్శించారు. బాబాసాహెబ్‌ను అవమానించిన ఆ పార్టీ చరిత్రను, వాస్తవాల చిట్టాను షా రాజ్యసభలో బయటపెట్టారని.. అది చూసి కాంగ్రెస్ నేతలు బిత్తరపోయారని అన్నారు.
అందుకే అంబేడ్కర్‌ను ఆయన అవమానించారని, కేబినెట్ నుంచి బహిష్కరించాలంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. ‘వారి దురదృష్టం ఏమిటంటే.. ప్రజలకు నిజం తెలుసు’ అని ప్రధాని బుధవారం ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు. అటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అశ్వినీ వైష్ణవ్, కిరెన్ రిజిజు కూడా షాకు అండగా నిలిచారు. తాను అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా ఒక్కనాటికీ మాట్లాడనని షా తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ
AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్.. హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు తర్వాత చర్యలు
Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..
Read Latest Telangana News and Telugu News