Share News

Jeevan Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:14 AM

న్యూ ఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ భేటీకి మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు.

Jeevan Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

న్యూ ఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసానికి గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ (Breakfast Meeting) జరిగింది. ఈ భేటీకి మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కూడా హాజరయ్యారు. నిన్న (బుధవారం) ఢిల్లీలో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal)ను జీవన్ రెడ్డి కలిసారు. అధిష్టానం జోక్యంతో జీవన్ రెడ్డి తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. మరికొద్ది సేపట్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్‌లు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.


కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీడడం ఖాయమన్న వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవాళ్ల అభిప్రాయాల ఆధారంగానే చేరికలు, ఇతర విషయాలలో ముందుకెళతామని అధిష్ఠానం హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పరిస్థితిని చక్కబెట్టారు. మూడ్రోజులుగా అసంతృప్తితో రగిలిపోతూ పార్టీని వీడేందుకు సిద్ధపడిన జీవన్‌రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసి ఢిల్లీ రావాలని కోరడంతో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం జీవన్‌ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో జీవన్‌రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అరగంటపాటు చర్చలు జరిపారు. అయినా జీవన్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు.


ఆ తర్వాత ముగ్గురూ కలిసి కేసీ వేణు గోపాల్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా తాను పార్టీని నమ్ముకుని ఉన్నానని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్‌ చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. జీవన్‌రెడ్డిని బుజ్జగించిన పెద్దలు.. పార్టీ అండగా ఉంటుందని, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుుంజుకుంటున్న సమయంలో పార్టీని వీడవద్దని కోరినట్లు తెలిసింది. దీంతో చల్లబడిన జీవన్‌రెడ్డి సమ్మతించారు. భేటీ అనంతరం బయటికి వచ్చాక జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్సే ముఖ్యమంటూ వెల్లడించారు. కార్యకర్తలను కాపాడుకోవడం ఏ పార్టీకైనా ముఖ్యమని అన్నారు.


కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మెరుగైన ఫలితాలు వచ్చాయని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, జాతి ఐక్యతను కాంగ్రెస్‌ కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ నెరవేరుస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలుకాని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఏకకాలంలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీకి కాంగ్రెస్‌ సంకల్పించదని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీం కోర్టుకు వెళ్దాం: కేసీఆర్

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ..

బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?

ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 11:16 AM