Share News

DSP: మన్నల్ని షేక్ చేసేవాడు లేడు

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:15 PM

పుష్ప మూవీ మేకర్స్‌పై సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పుష్ప-2 మూవీ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మరొకరికి అప్పగించడంపై ఫైరయ్యారు. మూవీ ప్రమోషన్ వేదికపై దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు చర్చకు దారితీశాయి.

DSP: మన్నల్ని షేక్ చేసేవాడు లేడు
Music Director DSP

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఫ్యాన్స్ తోడుంటే మనల్ని షేక్ చేసేవాడు లేరన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు చర్చకు దారితీశాయి. పుష్ప-2 మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందజేశారు. వచ్చేనెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా రిలీజ్ కానుంది. ఆ క్రమంలో దేవీ శ్రీ ప్రసాద్ గతంలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. మనకేం కావాలో అడిగి తీసుకోవాల్సిందే తప్ప.. మన్నలి పిండేది ఏం ఉండదని తెగేసి చెప్పారు.

Updated Date - Nov 25 , 2024 | 12:15 PM