Share News

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:12 PM

అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేసేందుకు రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదంటూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..
Group-1 Candidates Protest (File)

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రేపటి నుంచి నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనతో హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేసేందుకు రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదంటూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన చేసేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసుల జులం నశించాలంటూ గ్రూప్-1 బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత కొద్దిరోజులుగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. శనివారం కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాధితులతో కలిసి ఆందోళన చేయడం సంచలనం రేపింది. తాజాగా విద్యార్థులు ఇవాళ నిరసన తెలిపేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రేపటి నుంచి పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

CM Revanth Reddy: నాడు కలవని వాళ్లు నేడు పిలుస్తున్నారు..


ఏర్పాట్లు పూర్తి..

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 21నుంచి 27వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఇప్పటికే 90శాతం మంది అభ్యర్థులు తుది పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. మెుత్తం 563 పోస్టులకు గానూ 31,382మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. తమ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‍పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. రోజుకో హాల్ టికెట్‌తో అభ్యర్థులు రావొద్దని చెప్పింది. తొలి రోజు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లిన హాల్ టికెట్‌నే మిగిలిన రోజులూ తమ వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది. అయితే హాల్ టికెట్లను ఇప్పటికీ 10శాతం మంది డౌన్ లోడ్ చేసుకోలేదు. వీరంతా నిరసనల్లో పాల్గొంటున్నారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ - 1 పరీక్షలు రద్దు కాగా.. మూడోసారీ అదే పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళనలో 90శాతం మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతికి నిధులొస్తున్నాయ్‌!


పటిష్ఠ బందోబస్తు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇలా చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 20 , 2024 | 02:15 PM