Share News

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:44 PM

పటాన్‌చెరు(Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy), ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరార్మించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Ex Minister Harish Rao). గూడెం బ్రదర్స్ ఇళ్లలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..
Telangana Ex Minister Harish Rao

హైదరాబాద్, జూన్ 21: పటాన్‌చెరు(Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy), ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరార్మించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Ex Minister Harish Rao). గూడెం బ్రదర్స్ ఇళ్లలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించారు హరీష్ రావు. ఈడీ తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీహార్, గుజరాత్‌లలో నీట్ ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారని.. ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని.. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉందన్నారు.


నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిపై ఈడీ, ఐటీ దాడులు ఎందుకు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేరాలని ఒత్తిడికి గురిచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇంటెలిజెన్స్, ఫోన్స్ ద్వారా వివరాలు సేకరిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన మేనిఫెస్టోను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోబోమని చెప్పి.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారాలని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని.. ఆయన ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈడీకి ఎలాంటి ఆస్తులు దొరకలేదన్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయడం దారుణం అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. ధర్మం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు హరీష్ రావు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 21 , 2024 | 12:44 PM