Share News

సంబరాల సంక్రాంతి

ABN , Publish Date - Jan 15 , 2024 | 12:55 AM

తెలుగు వారి సంప్రదాయ పం డుగ సంక్రాంతిని ప్రజలు ఆత్మీయంగా జరుపుకుంటున్నారు. ఉత్సాహం, ఉ ల్లాసం, భక్తి భావాల మేళవింపుగా ముచ్చటగా మూడు రోజుల పాటు సం క్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు.

సంబరాల సంక్రాంతి

జగిత్యాల, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): తెలుగు వారి సంప్రదాయ పం డుగ సంక్రాంతిని ప్రజలు ఆత్మీయంగా జరుపుకుంటున్నారు. ఉత్సాహం, ఉ ల్లాసం, భక్తి భావాల మేళవింపుగా ముచ్చటగా మూడు రోజుల పాటు సం క్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఆనందోత్సహాల మద్య బోగి పండు గను జరుపుకోగా ఈనెల 15వ తేదీన సంక్రాంతి, 16వ తేదీన కనుమ వేడు కలను జరుపుకునేందుకు సి ద్ధమవుతున్నారు. ఇప్పటికే పల్లె, పట్నం అనే తేడా లేకుండా సొంతూళ్లకు జనం తరలివచ్చారు. గ్రామాలు, పట్టణా లకు వచ్చిన జనంతో వీది వీది సందడిగా మా రింది.

రంగవల్లులు, గొబ్బెమ్మలు...

సంక్రాంతి పండుగలో ముగ్గులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సం క్రాంతి పండుగ నెల రోజుల ముందే మహిళామణులు తమ ఇళ్ల ముందు రోజుకో ముగ్గు వేస్తూ ముంగిళ్లను అందంగా అలకరిస్తారు. పిండితో ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మను పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. సంక్రాంతి ముగ్గులో దాదాపుగా రథం ముగ్గు ప్రధానంగా కనిపిస్తోంది. అ ది వచ్చే యేడాది సైతం మరిన్ని లాభాలను నింపుతూ రావాలని నమ్మకం మహిళల్లో ఉంటుంది. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మద్యలో పెడుతారు. గొబ్బెమ్మలపై ప్రకృతిలో దొరికే గరక పోసలను పెట్టి పూల రేకు లు, పసుపు, కుంకుమ చల్లి వాటి చుట్టూ నవ ధాన్యాలు, రేగు పండ్లు పోసి ప్రత్యేకంగా పూజిస్తారు.

ఎగురనున్న పతంగులు...

సంక్రాంతి సందర్బంగా పతంగులు ఎగురవేయడం అనవాయితీగా చిన్నా పె ద్దా తేడా లేకుండా అందరూ గాలి పటాలు ఎగురవేస్తారు. రంగు రంగుల గాలి పటాలలో ఖరీదైన మాంజాలతో పోటా పోటీగా పతంగులతో సందడి చేస్తారు. జిల్లా కేంద్రలోని టవర్‌ సర్కిల్‌ ఏరియా, యావర్‌ రోడ్డు, పాత బస్టాండు తది తర ప్రాంతాలు పతంగుల విక్రయాలకు అడ్డాలుగా మారాయి. విక్రయాలు, కొ నుగోళ్లతో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలలోని పలు కూడల్లు రద్దీగా మారాయి. వీటితో పాటు మండల కేంద్రాలు, ఇతర గ్రామాల్లో సైతం పతంగుల సందడి నెలకొంది. గంగిరెద్దులు, కోడిపందాలు, ఎడ్ల పందాలు కొన్ని గ్రామాల్లో జరుపుకుంటున్నారు.

వలసలు వీడి సొంతూళ్లలోకి...

సంక్రాంతి పర్వదినం సందర్బంగా ప్రజలు వలసలు వీడి సొంతూళ్లకు చేరు కున్నారు. ఆడపడుచులు సైతం మెట్టింటి నుంచి పుట్టింటికి చేరుకోవడంతో ఇళ్లు, వాడ, పల్లె పండుగ శోభను సంతరించుకున్నాయి. ముందస్తుగా రైళ్లలో రిజర్వే షన్లు చేయించుకొని కొంత మంది, బస్సులు, సొంత వాహనాల్లో మరికొంత మం ది గ్రామాలకు చేరుకున్నారు.

ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు..

జిల్లాలోని పలు ఆలయాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ధనుర్మాసం లో వైష్ణవాలయాల్లో గోదా దేవీ కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. రైతులు ధాన్యలక్ష్మీని పూజించి మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయ్యప్ప దీక్షా భక్తులు ప్రతీరోజు ఆలయాల్లో పూజలు చేయడం, మకర జ్యోతి దర్శనం వంటివి చేస్తుంటారు.

తెలంగాణ సంక్రాంతి స్పెషల్‌ సకినాలు...

సంక్రాంతి పండుగ అంటే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికి ఇష్టమే. అందులోనూ ప్రత్యేక తినుబండారాల్లో తెలంగాణకు ఓ ప్రత్యేకత ఉంది. కరకరలాడే సకినాలు అనగానే మనవాళ్లతో పాటు ఏ ప్రాంతీయులకైనా నోరూ రుతాయి. ఒక ఇంటి వారు మరో ఇంటి వారికి పండి వంటలు, సకినాలు ఇచ్చి పుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటుంటారు. ఆడపడుచులు, వదినామర దళ్లు, అక్కా చెళ్లెల్లు, తల్లీకూతుళ్లు, అత్తా కోడళ్లు కలివిడిగా ఉంటూ సకినాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత.

ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకునే పండుగ

- దావ వసంత సురేశ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, జగిత్యాల

ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. రంగు రంగుల ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు అలంకరించడం, పతంగులు ఎగురవేయడం, నోములు ఇచ్చి పుచ్చుకోవడం తదితర పనుల్లో మహిళలు రోజంతా బిజీ బిజీగా గడుపుతారు. రైతులు ధాన్య లక్ష్మీకి పూజలు చేయడం వంటివి చేస్తుంటారు.

సంక్రాంతి ఆత్మీయ, అనురాగాలను అందిస్తుంది

తాటిపర్తి విజయలక్ష్మీ దేవేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, జగిత్యాల

సంక్రాంతి పండుగ ఆత్మీయ, అనురాగాలను అందిస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక్క చోటకు చేరి భక్తి శ్రద్ధలతో మూడు రోజుల పాటు పండుగను జరుపుకుంటుంటారు. బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను వరస గా చేసుకుంటూ ఆనందోత్సహాలతో గడుపుతుంటారు.

తెలుగు సంప్రాదాయం ప్రతిబింభిస్తోంది

- అయిత అనిత, కవయిత్రి, జగిత్యాల

సంక్రాంతి ఉత్సవాల్లో తెలుగు సంప్రాదాయం ప్రతిబింభిస్తోంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగులు, గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, హరిదాసు ల ప్రదర్శనలు, పిండి వంటలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఇలా ఒకటేమిటీ మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విదంగా బోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకుంటాము.

Updated Date - Jan 15 , 2024 | 12:55 AM