MV Ramanareddy: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు.. నందిని సిధారెడ్డిపై ఆగ్రహం
ABN , Publish Date - Dec 12 , 2024 | 02:41 PM
Telangana: ‘‘నేను చిన్నప్పటి నుంచి సిద్దిపేటలోనే చదువుకున్న, కళాకారుడిగా మాత్రమే నా పాత్ర. అమరజ్యోతి, తెలంగాణ తొలి శకటం కూడా నేనే ఏర్పాటు చేశాను. ఆర్టిస్టులు డబ్బుల కోసం చేస్తున్నారని అని సిధారెడ్డి మాట్లాడటం సరికాదు’’ తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి ఎంవీ రమణారెడ్డి అని అన్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 12: తెలంగాణ తల్లి రూపం మార్పుపై ప్రముఖ కవి, సాహితీవేత్త నందిని సిధారెడ్డి చేసిన వ్యాఖ్యలపై శిల్పి, చిత్రకారుడు ఎంవీ రమణారెడ్డి (Sculptor MV Ramanareddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనపై నందిని సిధారెడ్డి చేస్తున్న మాటలు చాలా దుర్మార్గమన్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి సిద్దిపేటలోనే చదువుకున్న, కళాకారుడిగా మాత్రమే నా పాత్ర. అమరజ్యోతి, తెలంగాణ తొలి శకటం కూడా నేనే ఏర్పాటు చేశాను. ఆర్టిస్టులు డబ్బుల కోసం చేస్తున్నారని అని సిధారెడ్డి మాట్లాడటం సరికాదు’’ అని అన్నారు.
CM Chandrababu: పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం.. మీరు సీరియస్‌గా తీసుకోండి
క్రియేటివిటీపై నమ్మకం ఉండబట్టే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ కూడా తీసుకోలేదన్నారు. ఆవేదనతో ఇక్కడికి వచ్చానని తెలిపారు. 2017 లో తొలి శకటం చేశానని.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రమణాచారి, అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో లేఖలు రాసినా ప్రభ్యుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. అదే ప్రభ్యుత్వం బీహార్‌కు చెందిన వ్యక్తికి 30 లక్షలకు పై చిలుకు ఇచ్చిందన్నారు. ప్రపంచంలోనే తొలి అమర జ్యోతి స్తూపాన్ని తయారు చేశానని.. ఏడేండ్లు అవుతున్నా కనీసం 40 శాతం డబ్బులు ఇవ్వలేదని.. కానీ కాంట్రాక్టర్‌కు 98 శాతం డబ్బులు ఇచ్చారని తెలిపారు.
‘‘నేను కోట్లు తీసుకున్నట్లు నందిని సిధారెడ్డి అన్న మాటలను ప్రూఫ్ చేయండి. తెలంగాణ తల్లి రూపకల్పనకు కళాకారుడిగా కోట్లు తీసుకున్నాననే అరోపణను రుజువుచేయాలి లేదా పత్రికాముఖంగా సిధారెడ్డి క్షమాపణ చెప్పాలి’’ అని సవాల్ విసిరారు. 14 యేండ్లు జర్మనీలోనే ఉండి ఉద్యమ కాలంలో అనేక పోస్టర్లు వేశానని.. ఎలాంటి రాజకీయ కోణాలు లేకుండా పని చేస్తే ఈ విధంగా ఆరోపణలు చేయటం సిగ్గు చేటన్నారు. ‘‘ మీ అవసరాల కోసం నిజాయితీ కలిగిన నా వంటి వ్యక్తిపై ఆరోపణలు సిగ్గు చేటు’’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో అనేకమైన అభినందనలు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సరికొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సరికొత్తగా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. గత ప్రభ్యుత్వాలు అధికారికంగా ఎక్కడా లాంచ్ చేయలేదన్నారు. ఆత్మత్యాగాలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ తల్లిని సాంప్రదాయంగా తీసుకోవాలనే ఆలోచనతోనే సరికొత్త రూపాన్ని తీసుకొచ్చినట్లు ఎంవీ రమణారెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఆలయంలో పాదం గుర్తు.. పూజలు చేసిన భక్తులు
Read Latest AP News And Telugu News