Share News

Minister Sitakka : విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:49 AM

సామాజిక న్యాయం జరగాలంటే పేదరికంపై యుద్ధం జరగాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.

Minister Sitakka : విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం

  • ములుగు జిల్లాలో కంటెయినర్‌ పాఠశాల

  • ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క

ములుగు, సెప్టెంబరు 17: సామాజిక న్యాయం జరగాలంటే పేదరికంపై యుద్ధం జరగాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు ఉచితంగా విద్య అందించేందుకు కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గొత్తికోయగూడెం బంగారిపల్లెలో రూ.13.50 లక్షలతో కంటెయినర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని చోట్ల కంటెయినర్‌ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 04:49 AM