MLA Komati Reddy Rajagopal Reddy : భగవంతుడి ఆశీస్సులతో మంత్రినవుతా
ABN , Publish Date - Aug 07 , 2024 | 05:15 AM
భగవంతుడి ఆశీస్సులతో మంత్రినవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కాస్త ఆలస్యమైనందుకు క్షమించాలని కోరారు.
అభివృద్ధిలో ఆలస్యమైనందుకు క్షమించండి: రాజగోపాల్రెడ్డి
చండూరు, ఆగస్టు 6: భగవంతుడి ఆశీస్సులతో మంత్రినవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కాస్త ఆలస్యమైనందుకు క్షమించాలని కోరారు. మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 2018లో తనను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని, నాటి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి చేయలేకపోయానని తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నంలో ఉందన్నారు. తెలంగాణ లోటు బడ్జెట్లో ఉన్నందున మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కాస్త ఆలస్యం అయిందన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానని తెలిపారు.