4న విద్యా సంస్థల బంద్ : ఎస్‌ఎఫ్‌ఐ
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:24 AM
విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్ పిలుపునిచ్చారు.

రామన్నపేట, జూలై 2: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి డాక్టర్లను అందించే నీట్ పరీక్షపత్రాన్ని లీక్‌చేయడంతో 20లక్షల మంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా మారిందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా సంస్థల బంద్ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగమట్ల శివ, పిల్లి కార్తీక్, దాసరి కార్తీక్, ముఖేష్ పాల్గొన్నారు.