Share News

Rajasthan Chief Minister: తెలంగాణలోనూ ఉత్తరాది ఫలితాల..

ABN , Publish Date - May 09 , 2024 | 10:49 AM

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) అన్నారు.

Rajasthan Chief Minister: తెలంగాణలోనూ ఉత్తరాది ఫలితాల..

- రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) అన్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గగన్‌పహడ్‌లోని సెలబ్రిటీ కన్వెన్షన్‌లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) ఆధ్వర్యంలో ‘ప్రవాసీ సమ్మేళనం’ పేరిట నిర్వహించిన చాయ్‌ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాజస్థాన్‌ యువకులు, వ్యాపారులను కోరారు. రాజస్థాన్‌లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వచ్చిందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని అన్నారు. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని తెలిపారు.

ఇదికూడా చదవండి: KTR: ఇన్వర్టర్లు, కొవ్వొత్తులు సిద్ధం చేసుకోండి..రాష్ట్ర ఓటర్లకు కేటీఆర్ సూచన

అభివృద్ధిలో ఉత్తరాది భాగస్వామ్యం: కొండా

హైదరాబాద్‌ అభివృద్ధిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణ సంస్కృతిలో భాగమై భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ పెట్టుబడులు, వ్యాపారాలతో తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడంలో రాజస్థానీయుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. నరేంద్రమోదీ సర్కార్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామ గ్రామానికి చేరాయని, వాటిని ప్రత్యక్షంగా అందుకుంటున్న లక్షలాది మంది ప్రజలు మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజస్థాన్‌కు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు నారాయణలాల్‌ పంచారియా, ఆహోర్‌ ఎమ్మెల్యే చంగన్‌సింగ్‌ రాజ్పతోహి, చేవెళ్ల పార్లమెంట్‌ బీజేపీ నాయకులు బొక్క నర్సింహారెడ్డి, డాక్టర్‌ ప్రేంరాజ్‌యాదవ్‌, టి.అంజన్‌కుమార్‌గౌడ్‌, వై.శ్రీధర్‌, పి.మల్లేశ్‌యాదవ్‌, ఎన్‌.మల్లారెడ్డి, జోగి రవి పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 10:51 AM