Share News

Revenue: రిజిస్ట్రేషన్లు తగ్గినా.. ఆదాయం పెరిగింది!

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:52 AM

గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో (ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు) రిజిస్ట్రేషన్లు తగ్గగా.. ఆదాయం మాత్రం పెరిగింది. గతేడాదిలో ఈ ఐదు నెలల పాటు 7.88 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా.. రూ.5,685 కోట్ల ఆదాయం సమకూరింది.

Revenue: రిజిస్ట్రేషన్లు తగ్గినా.. ఆదాయం పెరిగింది!

  • గతేడాదితో పోల్చితే 7% తగ్గిన రిజిస్ట్రేషన్లు

  • ఆదాయం మాత్రం 6.93% పెరుగుదల..

గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో (ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు) రిజిస్ట్రేషన్లు తగ్గగా.. ఆదాయం మాత్రం పెరిగింది. గతేడాదిలో ఈ ఐదు నెలల పాటు 7.88 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా.. రూ.5,685 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 7.33 లక్షల రిజిస్ట్రేషన్లు అవగా.. రూ.6,080 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఈసారి రిజిస్ట్రేషన్లలో 7.07 శాతం తగ్గుదల నమోదవగా.. ఆదాయం మాత్రం 6.93 శాతం పెరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ పెట్టుకున్న లక్ష్యాలతో పోల్చితే ఒక్క జూలై మినహా మిగిలిన 4 నెలల్లో దాన్ని చేరుకోలేదు.


అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ జూలైలో రిజిస్ట్రేషన్లు 19.19 శాతం పెరగ్గా.. ఆదాయంలోనూ 112.96 శాతం వృద్ధి కనిపించింది. అదే ఈ ఏడాది ఆగస్టు వచ్చేసరికి గతంతో పోలిస్తే 21.74 శాతం రిజిస్ట్రేషన్లు తగ్గాయి. జూలైలో పెరిగిన రిజిస్ట్రేషన్లు ఆగస్టులో పడిపోవడంపై అధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. ఆదాయం ఎక్కువగా వచ్చే రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యల కారణంగా ప్రజలు ఆస్తుల కొనుగోలులో ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్లపై పడిందని తెలుస్తోంది.

Updated Date - Sep 19 , 2024 | 03:52 AM