Share News

Rs.10 coins: రూ.10 నాణేలు తీసుకోవట్లే..

ABN , Publish Date - Nov 28 , 2024 | 09:07 AM

అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే 10, 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ప్రకటన జారీచేసిన సంగతి విదితమే. కానీ దీనికి విరుద్దంగా కొందరు వ్యాపారులు నాణేలను తిరస్కరిస్తున్నారు.

Rs.10 coins: రూ.10 నాణేలు తీసుకోవట్లే..

- ఆర్బీఐ నిబంధనలు పట్టని వ్యాపారులు

- ఇబ్బందులు పడుతున్న కొనుగోలుదారులు

హైదరాబాద్: అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే 10, 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ప్రకటన జారీచేసిన సంగతి విదితమే. కానీ దీనికి విరుద్దంగా కొందరు వ్యాపారులు నాణేలను తిరస్కరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్నాటక, యూపీ(Tamil Nadu, Kerala, Karnataka, UP) తదితర రాష్ట్రాల్లో ఇవి చెల్లుబాటులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చెల్లుబాటు కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవనోపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వలస వస్తుంటారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రేపు 4,250 బైక్‌లతో దీక్షాదివస్‌ వరకు ర్యాలీ


అలా వచ్చినవారు ఆ రాష్ట్రాల్లో చెల్లుబాటవుతున్న 10, 20 నాణేలను కొనుగోలు నిమిత్తం ఇస్తుంటే ఇక్కడ తిరస్కరిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు అన్ని షాపుల్లో ఇవి చెల్లేవిధంగా అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు వ్యాపారులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. డిజిటల్‌ మనీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్‌పే, భారత్‌పే, ఏటీఎంలకు అలవాటు పడి 10, 20 నాణేలు, కొంచెం చిరిగిన నోట్లను తిరస్కరిస్తున్నారు.


city5.jpg

డిజిటల్‌ పేమెంట్‌లు తెలియనివారు తమవద్ద ఉన్న నాణేలను ఏమిచేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. 10, 20 నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్‌ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది.


నాణేలు తీసుకోవడం లేదు

యూపీలో 10, 20 నాణేలు చెల్లుబాటు అవుతున్నాయి. ఇక్కడ మాత్రం తీసుకోవడం లేదు. అక్కడ నుంచి తెచ్చుకున్నవి ఇక్కడ చెల్లుబాటు కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటులో ఉన్నవాటిని ఇక్కడ ఎందుకు తీసుకోవడం లేదో తెలియని పరిస్థితి. అధికారులు దీనిపై ప్రజల్లో, వ్యాపారుల్లో అవగాహన కల్పించాలి.

- జావేద్‌, షాపూర్‌నగర్‌


అవగాహన కల్పించాలి

నాణేల చెల్లుబాటు విషయంలో క్రయ విక్రయదారులకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ఆమోదించిన కాయిన్స్‌ అన్ని చోట్ల చెల్లుబాటయ్యేలా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుంది.

- వెంకటేష్‌, శివాలయనగర్‌


ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2024 | 09:07 AM