Share News

CM Revanth: డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్, ఇథియోపియో డిప్యూటీ పీఎంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ABN , Publish Date - Jan 16 , 2024 | 10:14 AM

దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీగా ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోఫియా డిప్యూటీ పీఎం మేకొనెన్‌తో రేవంత్ భేటీ అయ్యారు.

 CM Revanth: డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్, ఇథియోపియో డిప్యూటీ పీఎంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్: దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీగా ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోఫియా డిప్యూటీ పీఎం మేకొనెన్‌తో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్యం పెంచే అంశాలపై మాట్లాడారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డితో ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu), పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సహ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి ఉన్నారు.

పారిశ్రామిక వేత్తలు, సీఈవోలతో భేటీ

వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సీఈవోలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించి, ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ది, పునరుత్పాదక ఇంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుతుంది. నొవర్తిస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక్, గూగుల్, ఉబెర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. మన దేశానికి చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్, సీఐఐ; నాస్కం వ్యాపార ప్రతినిధులతో ఈ రోజు, రేపు సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు.

వైద్యరంగంలో ఏఐ

వైద్యారోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజల హెల్త్ డేటా రూపొందించే అంశంపై రేపు చర్చ జరగనుంది. ఈ చర్చా గోష్టిలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు యురోపియన్ కమిషన్ ఆరోగ్య ఆహార కమిషనర్, జెనీవా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ అధినేత, ఆక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండ ఐటీ మంత్రి, మయో క్లినిక్ సీఈవో, టకేడా ఫార్మా కంపెనీ సీఈవో పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 16 , 2024 | 10:18 AM