Share News

Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన

ABN , Publish Date - Dec 19 , 2024 | 05:10 AM

సహచర నటిని వేధించిన కేసులో యూట్యూబర్‌, నటుడు ప్రసాద్‌ బెహ్రాను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన

  • యూట్యూబర్‌ ప్రసాద్‌ బెహ్రా అరెస్టు

బంజారాహిల్స్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సహచర నటిని వేధించిన కేసులో యూట్యూబర్‌, నటుడు ప్రసాద్‌ బెహ్రాను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మణికొండ పంచవటి కాలనీలో నివాసముండే ఓ యూట్యూబ్‌ నటి.. ప్రసాద్‌ బెహ్రా నిర్మిస్తున్న వెబ్‌ సిరీ్‌సలో నటిస్తోంది. సైలంట్‌ వ్యాలీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 14న షూటింగ్‌ జరుగుతుండగా అసభ్యంగా ప్రవర్తించాడని, ముఖం బాగా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకో అంటూ ఇబ్బందికర వ్యాఖ్యలు చేశాడని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రసాద్‌ బెహ్రాపై కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Dec 19 , 2024 | 05:10 AM