TG NEWS: ఎంజాయ్ చేద్దామని వచ్చి.. బురదలో చిక్కుకున్నారు..!
ABN, Publish Date - Jul 16 , 2024 | 03:17 PM
వర్షాకాలంలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. స్నేహితులతో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న వారు మట్టిలో ఇరుక్కుపోయారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని ధరూర్ మండలం కోటిపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ను (Kotipalli Project Backwater) చూసేందుకు హైదరాబాద్ నుంచి కొంతమంది పర్యాటకులు (Tourists) వెళ్లారు.
వికారాబాద్: వర్షాకాలంలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. స్నేహితులతో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న వారు మట్టిలో ఇరుక్కుపోయారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని ధరూర్ మండలం కోటిపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ను (Kotipalli Project Backwater) చూసేందుకు హైదరాబాద్ నుంచి కొంతమంది పర్యాటకులు (Tourists) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తమ వాహనాల్లో కాల్వ దాటి వెళ్లి అక్కడే ఉన్నారు. అయితే రాత్రి భారీ వర్షం పడటంతో వారు తిరిగి వచ్చేందుకు నానా అవస్థలు పడ్డారు.
బురదలో వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో రాత్రి అంతా బురదలో నుంచి వాహనాలను బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో వాహనాలను బురదలోనే వదిలేశారు. రాత్రి భారీ వర్షం పడటంతో వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. సరదాగా ఎంజాయ్ చేద్దామని వస్తే వాహనాలన్నీ నీట మునిగిపోవడంతో పర్యాటకులు షాక్‌కు గురయ్యారు. మూడు మహింద్రా థార్ వాహనాలు బురదలో చిక్కుకుపోగా ఓ ట్రాక్టర్‌ను గ్రామస్తులు తాడు సాయంతో బయటకు తీశారు. అయితే ఇంకా తమ వాహనాలు నీటిలోనే ఉండిపోవడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు.
Updated at - Jul 16 , 2024 | 03:17 PM