నాన్న దేవుడు.. ఇలా చేస్తుంది మా నాన్న కాదు.. పెద్ద కుట్ర..

ABN, Publish Date - Dec 11 , 2024 | 01:35 PM

మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న అన్ని విషయాలు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసే ప్రెస్ మీట్‌లో వివరిస్తానని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వెల్లడించారు. ఇంటి నిండా కార్లు.. ఇంటి నిండా మనుషుల ఉన్నారని.. కానీ ఆనారోగ్యానికి గురైన వ్యక్తిని 108లో తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న అన్ని విషయాలు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసే ప్రెస్ మీట్‌లో వివరిస్తానని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వెల్లడించారు. ఇంటి నిండా కార్లు.. ఇంటి నిండా మనుషుల ఉన్నారని.. కానీ ఆనారోగ్యానికి గురైన వ్యక్తిని 108లో తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయం ఎవరికైనా తెలుసా అని మంచు మనోజ్ ప్రశ్నించారు. ఈ విషయం పోలీసులకు సైతం తెలుసున్నారు.


కానీ ఈ విషయాలు ఏవీ బయటకు రావని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ విషయం రికార్డుల్లో ఉంటుందన్నారు. అది కూడా కనుక్కోవచ్చునని చెప్పారు. అదికూడా 108 ఎందుకు వచ్చిందనే దానిని కనుక్కోవచ్చునన్నారు. దొంగతనం చేసింది.. కిరణ్, విజయ్ అని చెప్పానని గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా మనోజ్ కోరారు.


మంగళవారం కిరణ్ అనే వ్యక్తి తమ ఇంట్లోనే తిరిగాడన్నారు. ఇంట్లోవాళ్లను బెదిరించరన్నారు. అతడి బెదిరింపులకు ఒక అమ్మాయి అయితే పారిపోయిందని తెలిపారు. తన కుమార్తె దుస్తులు సైతం ప్యాక్ చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. ఈ విషయం తెలిసి.. హుటాహుటిన తాను ఇంటికి వెళ్లానన్నారు.


పిల్లల జోలికి వెళ్లితే ఎవరికైనా భయమేస్తుందని తెలిపారు. కానీ తన తండ్రి మోహన్ బాబు దేవుడన్నారు. కానీ ఈ రోజు చూస్తున్న ఆయన తన తండ్రి కాదని తెలిపారు. తాను ఏమిటో.. తన ప్రవర్తన ఎలా ఉంటుందో అందరికి తెలుసున్నారు. కావాలంటే.. తన గురించి ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చన్నారీ మంచు మనోజ్.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 11 , 2024 | 01:50 PM