పల్లె సీమలు మరింత కళకళలాడాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:30 AM
సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘సూ ర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజు శాస్త్రపరంగా అన్ని విధాలా ప్రాముఖ్యతను కలిగింది. అందుకే మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను పాటిస్తూ, సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ.. మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలి.’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.
గవర్నర్‌కు సీఎం ఫోన్
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామం నారావారిపల్లి పర్యటనలో ఉన్న సీఎం .... సోమవారం రాత్రి గవర్నర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.