ఫీల్డ్ విజిట్ తర్వాతే బాండ్లు జారీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:07 AM
నాలుగో రోజూ క్యూకట్టిన టీడీఆర్ బాధితులు 284 డాక్యుమెంట్లు లాగిన్

తిరుపతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): టీడీఆర్ బాండ్ల జారీ స్పెషల్ డ్రైవ్ నాలుగో రోజైన సోమవారం బాధితులు కార్పొరేషన్ కార్యాలయానికి క్యూ కట్టారు. డాక్యుమెంట్లను తీసుకొచ్చి టౌన్ ప్లానింగ్ సిబ్బందికి అందజేశారు. గడిచిన నాలుగు రోజులుగా 29 మాస్టర్ ప్లాన్ రోడ్లకు గాను 26కు సంబంధించి 284 ఆస్తుల డాక్యుమెంట్లకు లాగిన్ చేశారు. 190 దరఖాస్తులకు వాలిడేషన్ పూర్తిచేయగా మరో 94 సిద్ధంగా ఉన్నాయి. 21 టీడీఆర్ దరఖాస్తులను సిటిజెన్స్ లాగిన్‌లో అప్‌లోడ్ చేశారు. మంగళగిరి నుంచి వచ్చిన టౌన్ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ వరప్రసాద్ మేళాను పర్యవేక్షించారు. అర్హుల జాబితా కొలిక్కి వచ్చాక క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే బాండ్లు జారీ చేస్తామని చెప్పారు.