Share News

AP News: పవన్‌ను అలా చూడాలని పదేళ్లుగా ఎదురు చూస్తున్నాం: కిరణ్ రాయల్..

ABN , Publish Date - Jan 20 , 2025 | 01:11 PM

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు.

AP News: పవన్‌ను అలా చూడాలని పదేళ్లుగా ఎదురు చూస్తున్నాం: కిరణ్ రాయల్..
Tirupati Janasena in-charge Kiran Royal

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌ (Kiran Royal) స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో కలిపి నలుగురని ఆయన చెప్పారు. మంత్రి లోకేశ్‌ (Nara Lokesh)ను డిప్యూటీ సీఎం పదవి (Deputy CM Post)లో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సీఎం అవ్వాలని, ఆయన్ని ఆ పదవిలో చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని జనసేన నేత కిరణ్ రాయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనవసరంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దంటూ టీడీపీ నేతలకు ఆయన హితవుపలికారు. పేర్ని నాని, రోజా వంటి పలువురు వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, వారికి అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండ్రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయని, దీనిపై ఐదుగురు అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడని, అందుకే భద్రత పెంచాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు.


కాగా, మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలంటూ రెండ్రోజులుగా టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ఈ జాబితాలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దీనిపై ఇప్పుడు కూటమి అగ్రనేతలు ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

AP DGP: డిప్యూటీ సీఎం పవన్ భద్రతపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
Supreme Court: సుప్రీంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

Updated Date - Jan 20 , 2025 | 01:32 PM