Share News

Tirupati : నేడు దక్షిణాది రాష్ర్టాల డీజీపీల సమావేశం

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:05 AM

మానస సరోవర్‌ హోటల్‌ వేదికవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉగ్రవాద మాడ్యూల్‌ సమస్యలు, వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు దాటిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు, తీర ప్రాంత భద్రత, నేరాల గుర్తింపు, నిరోధించడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై చర్చించనున్నారు.

Tirupati : నేడు దక్షిణాది రాష్ర్టాల డీజీపీల సమావేశం
Tirupati

  • తిరుపతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో మంగళవారం దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం జరగనుంది. దీనికి ఇక్కడి మానస సరోవర్‌ హోటల్‌ వేదికవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉగ్రవాద మాడ్యూల్‌ సమస్యలు, వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు దాటిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు, తీర ప్రాంత భద్రత, నేరాల గుర్తింపు, నిరోధించడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై చర్చించనున్నారు.


సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఇలాంటి సమన్వయ కమిటీ సమావేశాలు రాష్ట్రాల మధ్య సమన్వయం, నేరాలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. గతంలో ఇలాంటి సమావేశం 2021 నవంబరు 14న తిరుపతిలోనే జరిగింది. కాగా, ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు డీజీపీల తరఫున ఆయా రాష్ట్రాల హోం మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి అధికారులు హాజరవుతారు. పలువురు ప్రతినిధులు సోమవారం రాత్రికే తిరుపతికి చేరుకున్నారు. వీరందరికీ అవసరమైన ఏర్పాట్లను డీఐజీ షిమోషి, ఎస్పీ హర్షవర్ధనరాజు పర్యవేక్షిస్తున్నారు. సమావేశం జరిగే హోటల్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


ఇవీ చదవండి:

భారత జెండాకు భయపడుతున్న పాక్.. ఇండియా అంటే ఆ మాత్రం ఉండాలి

ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే

రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2025 | 10:55 AM