Share News

బీజేపీకి బిక్కవోలు ఎంపీపీ పదవి

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:07 AM

జిల్లాలో రాజకీయం వేడెక్కింది.. గురువా రం జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు నువ్వా నేనా అంటూ తలపడ్డారు.ఎక్కడ చూసినా కూటమి పైచేయి సాధించింది. నాడు వైసీపీ పంచన ఉన్న గ్రామస్థాయి నాయకులంతా కూటమి పంచన చేరారు. గెలుపునకు పాటుపడ్డారు.

 బీజేపీకి బిక్కవోలు ఎంపీపీ పదవి
బిక్కవోలు ఎంపీపీగా తొస్సిపూడి ఎంపీటీసీ తేతలి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రాజకీయం వేడెక్కింది.. గురువా రం జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు నువ్వా నేనా అంటూ తలపడ్డారు.ఎక్కడ చూసినా కూటమి పైచేయి సాధించింది. నాడు వైసీపీ పంచన ఉన్న గ్రామస్థాయి నాయకులంతా కూటమి పంచన చేరారు. గెలుపునకు పాటుపడ్డారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీకి బిక్కవోలు ఎంపీపీ పదవి దక్కింది. వైసీపీ నుంచి కూటమి తర పున బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసు కుంది. నాలుగేళ్లకు ముందు బిక్కవోలు ఎంపీపీ పద వి వైసీపీకి దక్కింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిం చడంతో పాటు, వైసీపీ అడ్రస్‌ గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ నేపఽథ్యంలో వివిధ కార ణాల వల్ల ఖాళీ అయిన పదవులు కూటమికి అనుకూలంగా మారుతున్నాయి. బిక్కవోలు ఎంపీపీ పదవి బీజేపీకి రాగా ఉపసర్పంచ్‌ ఎన్నికలు మాత్రం పార్టీలక తీతంగా జరిగా యి.పైగా ఈ పంచాయతీ పాలకవర్గాల గడు వు కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉండ డంతో కూటమి వీటిపై దృష్టిపెట్టలేదు. బిక్క వోలు ఎంపీపీగా తేతలి సుమ ఎన్నిక య్యా రు. ఆమె గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీటీసీ అయ్యారు. తర్వాత ఆమె బీజేపీ లోకి మారడంతో ప్రస్తుతం బీజేపీ తరపున కూటమి అభ్యర్థిగా పోటీ చేయగా 10 మంది ఎంపీటీసీలు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిని ప్రకటించి కూడా ఎన్నికలలో పాల్గొ నకపోవడం గమనార్హం. రంగంపేట మండల కోఆప్షన్‌ సభ్యుడిగా సిద్దెల వంశీధర్‌ ఎన్నిక య్యారు. జిల్లాలో 12 మంది ఉపసర్పంచ్‌ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగా, ఉండ్రాజవరం ఉప సర్పంచ్‌ ఎన్నిక వాయిదా పడింది. ఉండ్రాజవరం పంచాయతీ వార్డు సభ్యుడు మృతి కారణంగా వాయిదా వేశారు. గోకవరం మండలం మల్లేశ్వరం ఉప సర్పం చ్‌గా లంక ప్రసన్న, కొవ్వూరు మండలం పెన కనమెట్ట ఉపసర్పంచ్‌గా కొడమంచిలి వెం క ట్రావు,రాజానగరం మండలం పాతతుంగ పాడు ఉపసర్పంచ్‌గా పోటి ప్రభావతి, గోపాల పురం మండలం కొవ్వూరుపాడు ఉప సర్పం చ్‌గా జనపాటి నాగమణి, వెంకటాయ పా లెం ఉపసర్పంచ్‌గా వి.అమరప్రసాదరెడ్డి, తా ళ్లపూడి మండలం తాడిపూడి ఉప సర్పంచ్‌ గా పిట్టా తమ్మారావు, అనపర్తి మండలం లక్ష్మీనరసింహాపురం ఉపసర్పంచ్‌గా శీలం శ్రీని వాస్‌, రంగంపేట మండలం మర్రిపూడి ఉప సర్పంచ్‌గా నూకతట్టు అప్పాయమ్మ, కడి యం మండలం మురమండ ఉప సర్పంచ్‌గా యర్రంశెట్టి వీరబాబు, సీతానగరం మండలం మునికూడలి ఉప సర్పంచ్‌గా అనిమెల్లి సత్య వేణి ఎన్నికయ్యారు.వీరిలో మర్రిపూడి, ము రమండ,మునికూడలి ఉపసర్పంచ్‌లు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు.ఉప ఎన్నికల నేప థ్యంలో పల్లె రాజకీయం మారిపోయింది.

బిక్కవోలు మండల పరిషత్‌లో బీజేపీ పాగా

అనపర్తి/బిక్కవోలు,మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : బిక్కవోలు ఎంపీపీగా తొస్సిపూడి ఎంపీటీసీ తేతలి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మం డల పరిషత్‌ కార్యాలయంలో గురువారం జరి గిన ఎన్నికకు పంచాయతీ రాజ్‌ డీఈ కర్రి అచ్యుతరామారెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.ఎన్నికలకు 10 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా వీరిలో తొస్సిపూడి ఎంపీటీసీ తేతలి సుమ ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే నామినేషన్‌ గడు వు ముగిసే సరికి ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో సుమ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. గత ఎన్నికల్లో బిక్కవోలు మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా కొమరిపాలెం ఎంపీటీసీ కొవ్వూరి జ్యోతిర్మయి ఎంపీపీగా ఎన్నికయ్యారు.గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలు కావడంతో ఆమె తన ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో బిక్కవోలు ఎంపీపీ పదవికి ఎన్నికలు నిర్వహించారు.గతంలో కొంత మంది ఎంపీ టీసీలు కూటమి పంచన చేరగా.. గురువారం మరో ఏడుగురు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వీరిని పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో తేతలి సుమ(తొస్సిపూడి), జం పా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండాపు శాంతిశ్రీలక్ష్మి(బిక్కవోలు), కొర్ల చక్రరావు (మెళ్లూరు), పోలినాటి సువర్ణలత(ఇళ్లపల్లి), బండారు శివ (ఊలపల్లి) ఉన్నారు. ఈ ఎన్నికలకు వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించుకున్నప్పటికీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.దీంతో బీజేపీ అభ్యర్థి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.అనంతరం ఎన్నికల అధికారి అచ్యుతరామారెడ్డి నూతన అధ్యక్షురాలు సుమతో ప్రమాణం చేయించారు.సుమను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర,కూటమి నా యకులు కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, చిట్టిబాబు చౌదరి, పల్లె శ్రీనివాసరెడ్డి,ఆళ్ళ గోవిందు, నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి అభినందించారు.

Updated Date - Mar 28 , 2025 | 01:07 AM