Share News

సత్యదేవుని సన్నిధిలో నీటిని వృథా చేయొద్దు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:15 AM

అన్నవరం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో నీరు వృథా కాకుండా చూడాలని, కనీసం రోజు కు 2లక్షల లీటర్ల నీటిని పొదుపుచేయాలని కా కినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సూచించా రు. పోలవరం పనుల కారణంగా పంపా రిజర్వాయర్‌లో నీరు నిల్వలేకపోవడం, ప్రస్తుతం ఎండల కారణంగా ఉన్ననీరు ఆరించిపోవడంతో సత్రం గదుల్లో బస చేసే భక్తులకు నీటిసౌక ర్యం కల్పించే విషయంలో ఇబ్బందులు మరోపక్క శ్రీరామనవమి, స్వా

సత్యదేవుని సన్నిధిలో నీటిని వృథా చేయొద్దు

పంపా రిజర్వాయర్‌లోకి ఏలేరు నీరు చేరేలా చర్యలు

పోలవరం, ఇరిగేషన్‌, దేవస్థానం అధికారులతో కాకినాడ జిల్లా కలెక్టర్‌ సమీక్ష

అన్నవరం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో నీరు వృథా కాకుండా చూడాలని, కనీసం రోజు కు 2లక్షల లీటర్ల నీటిని పొదుపుచేయాలని కా కినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సూచించా రు. పోలవరం పనుల కారణంగా పంపా రిజర్వాయర్‌లో నీరు నిల్వలేకపోవడం, ప్రస్తుతం ఎండల కారణంగా ఉన్ననీరు ఆరించిపోవడంతో సత్రం గదుల్లో బస చేసే భక్తులకు నీటిసౌక ర్యం కల్పించే విషయంలో ఇబ్బందులు మరోపక్క శ్రీరామనవమి, స్వామివారి దివ్యకల్యాణోత్సవాల్లో చక్రస్నానం కార్యక్రమాల నీటి అవసరాలపై సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో పోలవరం, ఇరిగేషన్‌, దేవస్థానం అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఏలేరు నీటిని పోలవరం ప్రా జెక్ట్‌ పనులకు ఆటంకం కలగకుండా పైప్‌లైన్‌ వేసేందుకు సుమారు రూ.22లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేసి ఆ నిధులను ఇప్పిం చాలని కలెక్టర్‌ను కోరడంతో ఆయన అంగీకరించారు. అయితే ఏప్రిల్‌ 15 నుంచి ఏలేరు రిజర్వాయర్‌ నీటిని పంపాలోకి మళ్లించేందుకు చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏలేరు నీరువచ్చే కాలువవెంబడి పంటలు ఉంటే రోజుకు 25 క్యూసెక్కుల చొప్పున నెలరోజులు పంటలు లేకుంటే 50 క్యూసెక్కులు చొప్పున 15 రోజుల పాటు నీటిని అందిస్తే వేసవి నుంచి భక్తులు గట్టెక్కించవచ్చని ఇరిగేషన్‌ ఈఈ శేషగిరిరావు తెలపడంతో ఆవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో ఉన్న నీటినిల్వలు భక్తుల అవసరాలకు పొదుపుగా వాడుకుంటే నెలరోజులకు సరిపోతాయని ఇరిగేషన్‌ ఈఈ తెలిపారు. సమావేశంలో దేవస్థానం ఈవో సుబ్బారావు, ఈఈ నూకరత్నం, డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:15 AM