APPSC: మీరు గ్రూప్-2 పరీక్షలు రాశారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ABN , Publish Date - Feb 23 , 2025 | 09:37 PM
Group 2 Exam Candidates: ఈరోజు గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ పలు కీలక సూచనలు చేసింది. గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నాపత్రంలో ఏ ప్రశ్నపై అయినా కీ విషయంలో అభ్యంతరాలు ఉంటే సంబంధిత వైబ్‌సైట్‌లో తెలియజేయాలని ఏపీపీఎస్సీ సూచించింది.

అమరావతి: గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 92,250 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు .. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరిగింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రెటరీ నరసింహమూర్తి ప్రకటన విడుదల చేశారు.
మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఉండగా.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారు 86,459 మంది ఉన్నారని ఏపీపీఎస్సీ సెక్రెటరీ నరసింహమూర్తి తెలిపారు. వీరిలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 79 వేల 599 మంది పరీక్షకు హాజరైనట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 175 సెంటర్లలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఏపీపీఎస్సీకి ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాసిన వారు 92 శాతం మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నపై అయినా కీ విషయంలో అభ్యంతరాలు ఉంటే http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలియజేయాలని సూచించారు. ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రెండు పేపర్ల విషయంలో ఈ అభ్యంతరాలు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తామని చెప్పారు. అభ్యంతరాలను పోస్టు, వాట్సాప్ ఎస్ఎంఎస్, ఫోను, వ్యక్తిగతంగా ఇస్తే పరిగణనలోకి తీసుకోబడవని ఏపీపీఎస్సీ సెక్రెటరీ నరసింహమూర్తి స్పష్టం చేశారు.
అభ్యర్థులకు న్యాయం: సమయం హేమంత కుమార్
విశాఖపట్నం: గ్రూప్ 2 ప్రశ్నాపత్రం చూసిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగం వచ్చినంత ఆనందం పొందారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ తెలిపారు. రోస్టర్ లోపాలను సవరించి ఉద్యోగాలు భర్తీ చేస్తే అభ్యర్థుల అందరికీ న్యాయం జరుగుతుందని సమయం హేమంత కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Rammohan Naidu: ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర
YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు
YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..
YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి
Read Latest AP News and Telugu News