Share News

Sai Sadhana Chit Fund:కోర్టులో లొంగిపోయిన సాయి సాధన చిట్స్ అధినేత పుల్లారావు

ABN , Publish Date - Feb 06 , 2025 | 09:28 PM

Sai Sadhana Chit Fund: కోట్లాది రూపాయిలు అప్పు చేసి పరారైన సాయి సాధన చిట్ పండ్స్ అధినేత పాలడుగు పుల్లారావు కోర్టులో లొంగిపోయారు. గుంటూరు జిల్లా కోర్టులో గురువారం అతడు లొంగిపోయాడు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Sai Sadhana Chit Fund:కోర్టులో లొంగిపోయిన సాయి సాధన చిట్స్ అధినేత పుల్లారావు

గుంటూరు, ఫిబ్రవరి 06: ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సాయి సాధన చిట్స్ అధినేత పాలడుగు పుల్లారావు గురువారం జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో కోర్టు.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో పాలడుగు పుల్లారావును పోలీసులు అదుపులోకి తీసుకొని.. గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు పుల్లారావు అరెస్ట్‌తో.. చిట్ ఫండ్స్‌ సంస్థలోని భాగస్వాములను స్టేషన్‌కు పోలీసులు పిలిపిస్తు్న్నారు. నరసరావుపేటలో సుమారు రూ.170 కోట్లు అప్పు చేసి ఇటీవల పాలడుగు పుల్లారావు పరారయ్యాడు. ఫోన్ స్విచ్చాప్ చేసి కుటుంబంతో సహా పుల్లారావు అజ్ఞాతంలోకి వెళ్లారు.

దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇక నరసరావుపేటలోని అన్ని బ్యాంకులకు సాయి సాధన చిట్ ఫండ్స్ ఆర్ధిక లావాదేవీలు నిలుపుదల చేయాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు నరసరావుపేటలోని సాయిసాధన చిట్‌ఫండ్‌ కార్యాలయాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. అంతకుముందు డీఎస్పీ నాగేశ్వరరావు, తహసీల్దార్‌ వేణుగోపాల్‌రావు నేతృత్వంలో సదరు సంస్థలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత రికార్డులు పరిశీలించాక చిట్‌ఫండ్‌ కార్యాలయానికి అధికారులు సీజ్‌ చేశారు. పాలడుగు పుల్లారావుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


విజయ లక్ష్మీ టౌన్ షిప్ పేరుతో రియట్ ఎస్టేట్‌లో తాను రూ. 2.8 కోట్ల మేర నష్టపోయానని సుబ్బారెడ్డి అనే వ్యక్తి పల్నాడు పోలీసులను ఆశ్రయించాడు. అలాగే అదే సంస్థలో తాను సైతం రూ. 11 కోట్లు నష్టపోయానని వ్యాపారవేత్త డి. రాజ్యలక్ష్మీ గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలా చిట్ ఫండ్స్ ఏర్పాటు చేసి..దాని మాటున ఇలా వేరే వ్యాపారాలు ప్రారంభించి.. ప్రజలు మోసం చేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ మోసాలకు తెర తీసిందని పోలీసులు గుర్తించారు. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సైతం దృష్టి కేంద్రీకరించారు. దీంతో చిట్ ఫండ్ కంపెనీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా సమగ్ర విచారణ చేట్టారు. అయితే అజ్జాతనంలో ఉండి ఈ విషయం తెలుసుకొన్న సదరు చిట్ ఫండ్స్ ఎండీ పాలడుగు పుల్లారావు.. గురువారం కోర్టులో లోంగిపోయారు.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ఢిల్లీ ఫలితాలపై యాక్సిస్ మై ఇండియా అంచనా ఇదే.. సునామీ సృష్టించనున్న ఆ పార్టీ

Also Read: ఢిల్లీలో మేము ఓడిపోతాం.. గెలుపు ఆపార్టీదే.. తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత

Also Read: క్రీడాకారులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

Also Read:: మంత్రి గొట్టిపాటితో గ్రానైట్ యజమానులు కీలక భేటీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 09:39 PM