Share News

AP News: 145 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన వైసీపీ నేత..

ABN , Publish Date - Jan 29 , 2025 | 08:06 AM

గుంటూరు: ఓ మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ (Nandigam Suresh) జైలు నుంచి విడుదల అయ్యారు. బుధవారం నాడు గుంటూరు కోర్టు రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

AP News: 145 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన వైసీపీ నేత..
YSRCP leader Nandigam Suresh

గుంటూరు: ఓ మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ (Nandigam Suresh) జైలు నుంచి విడుదల అయ్యారు. బుధవారం నాడు గుంటూరు కోర్టు రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నిన్న షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఇవాళ (గురువారం) ఉదయం సురేశ్ బయటకు వచ్చారు. మహిళ హత్య కేసులో గతేడాది అక్టోబర్ 7న అరెస్టయిన సురేశ్ దాదాపు 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు.


అనంతరం ఆరోగ్య సమస్యల దృష్ట్యా చికిత్స చేయించుకునేందుకు అంబులెన్స్‌లో విజయవాడకు బయలుదేరారు. జైలు నుంచి విడుదలైన నందిగం సురేశ్ మాట్లాడుతూ.. " కాలర్ బోన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నా. కాలర్ బోనుకు చికిత్స చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్లా. అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నొప్పి ఉన్నప్పుడల్లా జైలు అధికారులకు చెప్తే హాస్పటల్ తీసుకెళ్లేవారు. ఇప్పుడు కూడా నొప్పిగా వేధిస్తోంది. అందుకే విజయవాడ హాస్పిటల్‌కు వెళ్తున్నానని" చెప్పారు.


కాగా, గుంటూరు జిల్లా వెలగపూడిలో 27, డిసెంబర్ 2020న ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి జరిగింది. సుమారు 100 మంది దాడి చేయడంతో మరియమ్మ అనే మహిళ మృతిచెందింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం ప్రయోజనం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఘటనపై కేసు నమోదు అయ్యింది. విచారణ చేపట్టిన పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు నిర్ధరించారు. అప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులోనూ నందిగం సురేశ్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. కాగా, తాజాగా నందిగం సురేశ్‌కు గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్‌.. ప్రయోగం విజయవంతం..

Minister Nimmala Ramanaidu : డీఈఈల పదోన్నతులకు లైన్‌ క్లియర్‌!

Updated Date - Jan 29 , 2025 | 08:32 AM