Share News

YS Jagan: సభకు ఎందుకు వెళ్లానురా దేవుడా!

ABN , Publish Date - Feb 26 , 2025 | 03:25 AM

గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా శాసనసభకు ఎందుకు వెళ్లానురా దేవుడా! అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తలపట్టుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

YS Jagan: సభకు ఎందుకు వెళ్లానురా దేవుడా!

  • ఆత్మరక్షణలో పడిపోయిన వైఎస్‌ జగన్‌

  • ప్రభుత్వ టెండర్లలో స్టార్ట్‌పలకు అవకాశం

  • రూ.50 లక్షల విలువైన టెండర్లలో పాల్గొనవచ్చు

  • అనుభవం, టర్నోవర్‌, ఈఎండీ అవసరం లేదు

  • స్టార్ట్‌పలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

  • ఐటీ వర్గాల హర్షం

  • సభ్యత్వం పోతుందని హడావుడిగా గవర్నర్‌ ప్రసంగానికి

  • కానీ, దానిని ‘హాజరు’గా పరిగణించరని తెలిసి అవాక్కు

  • స్వార్థం కోసం ఇంత డ్రామానా అంటూ విమర్శలు

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా శాసనసభకు ఎందుకు వెళ్లానురా దేవుడా! అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తలపట్టుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. సభకు వరుసగా అరవై రోజులపాటు గైర్హాజరైతే సభ్యత్వం రద్దవుతుందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు చేసిన ప్రకటన వలలో వైసీపీ పడింది. దీంతో... ఆదరాబాదరాగా సోమవారం జగన్‌ అసెంబ్లీకి వెళ్లి హాజరుపట్టికలో సంతకం చేశారు. గవర్నర్‌ ప్రసంగం మొదలు కావడానికి రెండు నిమిషాల ముందు సభకు వచ్చి.. ఆయన ప్రసంగం ప్రారంభించిన తొమ్మిదో నిమిషంలో తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్‌ వాకౌట్‌ చేశారు. అలా.. ‘అరవై రోజుల’ గండం తప్పించుకున్నానని ఆయన భావించారు. మంగళవారం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. పులివెందుల వెళ్లిన జగన్‌.. బుధవారం బెంగళూరుకు చేరుకుంటారు. తిరిగి వచ్చే మంగళవారం ఆయన తాడేపల్లి చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఆయనకు ప్రతిపక్ష నేత హోదాను ఇస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటేనే ఆయన సమావేశాలకు హాజరవుతారని ఈ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు మార్చి 21వ తేదీతో ముగుస్తాయి. అయితే, జగన్‌ మెడపై వేలాడుతున్న కత్తి ఇప్పటికీ తొలగిపోలేదని అసెంబ్లీ వ్యవహారాలతో పరిచయం ఉన్న వారు చెబుతున్నారు. గవర్నర్‌ ప్రసంగం ఉన్న రోజును శాసనసభా వ్యవహారాలు జరిగినట్లుగా పరిగణించరని తేల్చి చెబుతున్నారు.


అంటే, వ్రతం చెడింది. కానీ, ఫలం మాత్రం దక్కలేదన్నమాట! ప్రతిపక్ష హోదా రానందుకు అసెంబ్లీలో అడుగుపెట్టరాదని జగన్‌ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే, శాసనమండలిలో ప్రతిపక్ష హోదా ఇప్పటికీ వైసీపీకి ఉంది. దీంతో అక్కడి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. ఇది కూడా జగన్‌ను ఇరుకునపడేస్తోంది. శాసనమండలికివెళ్తూ .. శాసనసభకు ఎందుకు వెళ్లరన్న ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. జగన్‌ రాజకీయం అంతా తన పదవులకోసం.....హోదాకోసమే తప్ప ప్రజాసమస్యల పరిష్కారంకోసం కాదా? అంటూ రాజకీయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెండు అడుగులు ముందుకేసి..‘‘దమ్ముంటే శాసనసభకు వెళ్లు. లేదంటే రాజీనామా చేయి’’ అంటూ సవాల్‌ విసిరారు. కాగా, ఈ నెల 28న బడ్జెట్‌ సెషన్‌కు, దానిపై తాను స్పందించేందుకు వచ్చే నెల మూడున జగన్‌ మరోసారి అసెంబ్లీకి వెళతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వాదనలను వైసీపీ వర్గాలు ఖండిస్తున్నాయి.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 26 , 2025 | 03:25 AM