Tirupati district : జల్లికట్టు.. ఠారెత్తేట్టు! 40 మందికి గాయాలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:26 AM
చంద్రగిరి పరిసర ప్రాంతాల నుంచి భారీగా ఎద్దులను తీసుకొచ్చారు. వాటి కొమ్ములు చెలిగి, రంగులు వేసి, కొప్పులను తొడిగి, రాజకీయ నాయకులు, సినీనటులు, దేవుళ్ల ఫొటోలు..

చంద్రగిరి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. చంద్రగిరి పరిసర ప్రాంతాల నుంచి భారీగా ఎద్దులను తీసుకొచ్చారు. వాటి కొమ్ములు చెలిగి, రంగులు వేసి, కొప్పులను తొడిగి, రాజకీయ నాయకులు, సినీనటులు, దేవుళ్ల ఫొటోలు, రంగుల కాగితాలు అతికించిన చెక్క పలకలతోపాటు, నగదు, విలువైన వస్తు సామగ్రిని వాటికి కట్టారు. వీధిలో గుంపులుగా ఎద్దులను వదలడంతో వాటిని నిలువరించి కొమ్ములకున్న బహుమతులను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో సుమారు 40 మందికి గాయాలయ్యాయి. అక్కడే ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో వీరికి వైద్యం అందించారు. తీవ్ర గాయాలైన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..