Share News

టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్‌ షేక్‌ మెహరూన

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:18 AM

వైసీపీ నుంచి టీడీపీకి మళ్లీ వలస బా ట మొదలైంది. మంగళవారం వైసీపీ 25 వవార్డు కౌన్సిలర్‌ షేక్‌ మెహరూన ఎమ్మె ల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్‌ షేక్‌ మెహరూన
వైసీపీ కౌన్సిలరుకు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే

కౌన్సిల్లో మెజారిటీ దిశగా పావులుకదుపుతున్న టీడీపీ

ప్రొద్దుటూరు , మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నుంచి టీడీపీకి మళ్లీ వలస బా ట మొదలైంది. మంగళవారం వైసీపీ 25 వవార్డు కౌన్సిలర్‌ షేక్‌ మెహరూన ఎమ్మె ల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. స్ధానిక టీడీపీ కార్యాలయంలో కౌన్సిలర్‌ షేక్‌ మెహ రూన తోపాటు మైనారిటీ నాయకుడు నూరి మరికొంతమంది టీడీపీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆయన బావమరిది బంగారురెడ్డిలు ఎన్ని జిమ్మిక్కులుచేసినా వైసీపీని నమ్మరన్నారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయమన్నారు. ఇప్పటికే 14మంది టీడీపీలో చేరగా మెహరూనతో కలిపి 15 మంది కానున్నారు. కాంగ్రెస్‌ జనసేనల తరుపున ఇర్ఫాన మహ్మద్‌ గౌస్‌లు కూడా టీడీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో వారి బలం ప్రస్తుతం 17మంది వున్నారు. మరో నలుగురు వైసీపీ కౌన్సిల్లర్లు టీడీపీలోకి రావడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నం ద్యాల కొండారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈవీ సుదాకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన జబివుల్లా, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, టౌన బ్యాంకు చైర్మన బొగ్గుల సుబ్బారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:18 AM