Share News

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:16 AM

వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడా లని జడ్పీ సీఈవో ఓబుళమ్మ అధి కారులను ఆదేశించారు.

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
గండికోట జలాశయంలోని నీటి సరఫరా మోటారును పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో

కొండాపురం/ముద్దనూరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడా లని జడ్పీ సీఈవో ఓబుళమ్మ అధి కారులను ఆదేశించారు. గం డికోట ప్రాజెక్టు వద్ద సీపీడబ్ల్యూఎస్‌ స్కీ మ్‌ను, పంప్‌హౌస్‌ను, అందులోని మోటర్‌లను మంగళవారం పరీశీ లించారు. చిన్నచిన్న మరమ్మతులు వస్తే పంచాయతీ నిధుల నుంచి వాడుకోవాలని కార్యదర్శులకు సూ చించారు. పెద్దసమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావా లని తెలిపారు. పైపులైన ద్వారా లీకేజీలు లేకుండా చూడాలని అధికా రులను కోరారు. పలు గ్రామాలకు నీరు అందించే సీపీడబ్లూఎస్‌ వాటర్‌ స్కీమ్‌ ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కొండాపురం, ముద్దనూరు ఎంపీడీవోలు నాగప్రసాద్‌, ముకుందరెడ్డి, కాంట్రాక్టర్‌ గండ్లూరు శంకర్‌రెడ్డి ,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ముద్దనూరు మండలంలో తాగునీరు, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ సీఈవో ఓబులమ్మ గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు.టౌన్‌లోని తాగు నీటి సంపును, ట్యాంకును అలాగే ముద్దనూరు మండలానికి సంబందించి గండికోట జలాశయం వద్ద నున్న సీపీడబ్ల్యూఎస్‌ పథకాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. తరువాత ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ముకుందారెడ్డి, సీఈవో టెక్నీకల్‌ అడ్వైజర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఈవోపీఆర్డీ వీరభద్రుడు, ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈ మోహన్‌, ఏఈ హరీష్‌ ఈవో నరసింహులు, సచివాలయాలు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:16 AM