Share News

CM Chandrababu: చిత్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు..

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:50 PM

CM Chandrababu: ఈనెల 6 నుంచి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవీడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రకృతి వ్యవసాయం విజన్‌లను ప్రారంభిస్తారు.

CM Chandrababu: చిత్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు..
AP CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu naidu) చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6 నుంచి 8 వరకు చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలతో సమావేశంకానున్నారు. పలు ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం. ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవీడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రకృతి వ్యవసాయం విజన్‌లను ప్రారంభిస్తారు. అనంతరం స్వర్ణకుప్పం విజన్ 2029 పై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అగారాం కొత్తపల్లి గ్రామానికి వెళ్లి డ్వాక్రా సంఘాలతో సీఎం మాటామంతి నిర్వహించనున్నారు. 2:30 గంటలకు నడిమూరు గ్రామంలో సౌర విద్యుతీకరణ కార్యక్రమం ప్రారంభం అనంతరం స్థానిక యువతతో ఇష్టాగోష్టిలో పాల్గొటారు. అనంతరం సిగాల పల్లెకు చంద్రబాబు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు ద్రవీడియన్ యూనివర్సటీ ఆడిటోరియంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. రాత్రి 7:30 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు.


7వ తేదీన సీఎం కార్యక్రమాలు...

7న ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ ఆఫీసుకు సీఎం చేరుకుంటారు. అక్కడ జన నాయకుడు సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ప్రజల నుంచి అర్జీల స్వీకరించనున్నారు. మధ్యహ్నం 12:30 గంటలకు కంగుండి గ్రామానికి వెళ్లనున్న సీఎం.. శ్యామన్న విగ్రహన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. మధ్యహ్నం 1:30 గంటలకు కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చంద్రబాబు వెళ్తారు. మధ్యహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకూ మథర్ డెయిరీ, శ్రీజా మహిళా పాల సేకరణదారుల సంస్థను సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానుంది. ఎన్టీఆర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కాడా కమండ్ కంట్రోల్ రూం, మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు.

Atchannaidu: వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ



ఐఐటీ కాన్పూర్‌తో అవగాహన కుదుర్చుకుని కుప్పాన్ని నెట్ జీరో నియోజకవర్గంగా మార్చే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. మహిళా శక్తి భవన్‌లో ఏలీప్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. సీఈవో బిగ్ బాస్కట్, ఎన్డీడీపీ చైర్మన్‌లతో సమావేశం అవుతారు. సాయంత్రం 4:45 గంటలకు కుప్పంలోని తమ నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ద్రవీడియన్ యూనివర్సిటీలో అకడమిక్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..అధికారులతో అక్కడే సమావేశం అవనున్నారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌తో రెండవ రోజు చంద్రబాబు బస చేయనున్నారు. తిరిగి ఎనిమిదివ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే

రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 04 , 2025 | 01:50 PM