Share News

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై సమన్వయంతో పనిచేయండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:43 AM

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులను ఆదేశించారు.

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై  సమన్వయంతో పనిచేయండి
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

పెనమలూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులను ఆదేశించారు. తాడిగడపలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమలో జరుగుతున్న మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు తోడు మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నది తన లక్ష్యమన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్ల మరమ్మతులు, నూతనంగా పైపులైన్లు, బోర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కుల అభివృద్ధితో పాటు పార్కుల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. కొత్తగా చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, స్టార్మ్‌వాటర్‌ డ్రైన్ల నిర్మాణం పెండింగ్‌ పనుల వివరాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి సమగ్ర నివేదికలను అందించాలని ఆదేశించారు. సమావేశంలో జోనల్‌ కమిషనరు రమ్య కీర్తన, సీఈ శ్రీనాథరెడ్డి, సిటీ ప్లానర్‌ ప్రసాద్‌, డీసీపీ చంద్రబోస్‌, టీపీవోలు మురళీగౌడ్‌, రిజ్వానా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న మంత్రి ఫరూక్‌, ఎమ్మెల్యే సుజనా చౌదరి

వన్‌టౌన్‌: మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ తారా పేటలోని తన నివాసంలో గురు వారం ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. సుజనా చౌదరి, న్యాయ శాఖ మంత్రి ఎన్‌.ఎండీ ఫరూఖ్‌, పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:43 AM