అమరవీరులకు ఘన నివాళి
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:19 AM
సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో పట్టణంలోని పింగళిసూరన శాఖ గ్రంథాలయంలో భగత్‌సింగ్ 94వ వర్ధంతి సదర్భంగా అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నంద్యాల కల్చరల్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో పట్టణంలోని పింగళిసూరన శాఖ గ్రంథాలయంలో భగత్‌సింగ్ 94వ వర్ధంతి సదర్భంగా అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభ్యులు, కవులు, ఉపాధ్యాయులు భగత్‌సింగ్ చిత్రపటానికిపూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్‌గురు, సుఖదేవ్ త్యాగాలను గుర్తిచేసుకున్నారు. దివంగత దేవులపల్లి చెంచుసుబ్బయ్య రచించిన సాహిత్య పుస్తకాలను వారి కుటుంబ సభ్యులు పాఠకులకు అందజేశారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, రోటరీ విద్యాసంస్ధల అధినేత డీవీ సుబ్బయ్య, రచయితలు డా.వెంకటేశ్వర్లు, ప్రసాద్, కవులు అన్నెం శ్రీనివాసరెడ్డి, నరేంద్ర, కళామురళి, రామచంద్రమూర్తి, శివరామిరెడ్డి, పుల్లయ్య, గ్రంథా లయాధికారి రాధాబాయి తదితరలు పాల్గొన్నారు.
నంద్యాల రూరల్: నంద్యాలలోని సీపీఎం కార్యాలయంలో భగత్‌సింగ్ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్, కార్యదర్శి వర్గ సభ్యుడు నాగరాజు, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, మహమ్మద్‌గౌస్, బాలవెంకట్, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శివ, పాల్గొన్నారు.
పట్టణంలోని పీడీఎస్‌యూ నాయకులు కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, జిల్లా ఉపాధ్యక్షుడు షాహిన్, పట్టణ నాయకులు సుభాన్, హరి, నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో భగత్‌సింగ్ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ జిల్లా సహయకార్యదర్శి బాబాపకృద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనవాసులు తదితరులు పొల్గొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి హరివర్ధన్, నాయకులు శేషాద్రి నాయుడు, అబ్దుల్లా ఖాన్, వంశీ, రాము, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ వర్ధంతిని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు రణధీర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దినేష్‌కుమార్, సాయి పాల్గొన్నారు.
పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: మండలంలోని ఎ.కోడూరులో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సుబ్బరాయుడు, కార్యదర్శి డేవిడ్, కుళాయిస్వామి, చంద్రబాబు, శిఖామణి పాల్గొన్నారు.
సున్నిపెంట: సున్నిపెంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఆశీర్వాదం, వై.శీను, మల్లికార్జున, ఏఐవైఎఫ్ నాయకులు మహేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పాణ్యం: సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. మోడల్ పాఠశాల, హాస్టల్‌లో విద్యార్థులు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో ప్రజా సంఘాల నాయకులు భాస్కర్, రాజా, నాగరాజు, ప్రతాప్, ఆటో, హమాలి యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.